అక్క కోసం..ఓ తమ్ముడు...తొమ్మిదేళ్లు....!

Update: 2018-08-11 03:47 GMT

చిన్నప్పుడు తన వేలు పట్టి నడిపించిన అక్క.. అమ్మ లేనప్పడు అమ్మలా లాలించిన అక్క .. అమ్మా నాన్నలా ఎత్తుకుని పెద్దవాడిని చేసిన అక్క .. అకస్మాత్తుగా ఉన్నట్టుండి అదృశ్యం అయింది... ఎవరికీ చెప్పకుండా అందరినీ వదిలి వెళ్ళిపోయింది... అక్కే ప్రాణంగా బతికిన ఆ తమ్ముడు తల్లడిల్లి పోయాడు. ఎలాగైనా అక్క అచూకీ కని పెట్టాలని కంటి మీద కునుకు లేకుండా గడిపాడు.... ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా తొమ్మిది సంవత్సరాలు అక్క ఆచూకీ కోసం వెతుకుతూనే ఉన్నాడు. చివరకు ఆచూకి అయితే తెలిసింది కాని... తట్టుకోలేని వాస్తవం కళ్ళముందుకు వచ్చింది.... అక్కకోసం తిరిగి తిరిగి అలసి పోయిన ఆ తమ్ముడి గుండె చెదిరిపోయే విషాదం.. ఇంతకీ ఏంటా విషాదం.. ఈ స్టోరీ చదవండి...!

ప్రేమ పేరుతో.....

సామాజిక వెబ్ సైట్, ఫేస్ బుక్ ద్వారా ఓ కరుడుగట్టిన నిజాన్ని తెలుసుకున్నాడు తమ్ముడు ఉపేందర్. తొమ్మిది సంవత్సరాల క్రితం అదృశ్యం అయిన అక్క ,పిల్లల ఆచూకి తెలుసుకొన్నాడు.. గత తొమ్మిది సంత్సరాలుగా కనిపించకుండా పోయిన అక్క కోసం తిరగని గుడి ఎక్కని మెట్టు అంటూలేదు. చివరకు అక్క ఆచూకి అయితే తెలిసింది కానివారి కుటుంబంలో తీరని విషాదం నింపింది. చివరకు ప్రాణంగా భావించిన అక్క మరణించింది. కాదు కాదు సోంత బావే కాలయముడయ్యాడు. అతికిరాతకంగా హతమార్చాడు. ఈ వాస్తవం విన్న అ తమ్ముడి గుండె అగిపోయేంత పనైంది.

ఎల్పీ నగర్ లో ఉంటూ...

మృతురాలి సోదరుని పేరు ఉపేంద్ర చారి స్వస్థలం నల్లగొండ జిల్లా నార్కేట్ పల్లి మండలం మాండ్ర గ్రామం. బతుకుతెరువు కోసం తన సోదరుడు, సోదరి, తల్లితో కలిసి హైదరాబాద్ వచ్చి ఎల్బీనగర్లో నివాసముంటూ జీవనం సాగిస్తున్నారు. తల్లి మూగ, చెవిటి మరో సోదరుడు వికలాంగుడు కావడం.... ఉపేంద్ర చారికి తోడు సోదరి పేరు ప్రియా వీరికి వంట చేస్తూ వుండేది. ఎలిబినగర్ చౌరస్తాకు సమీపంలోని మజీద్ గల్లీలో అద్దెకు ఉంటున్నారు. వీరంతా ఒకేచోట నివాసం ఉంటున్నారు. వీరికి సమీపంలోనే మోరే హనుమంతు నివాసం ఉండేవాడు ఇతను క్యాబ్ డ్రైవర్ .హైదరాబాదులో పనిచేస్తూ ప్రియా ను ప్రేమ పేరుతో లొంగదీసుకొని మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడు. సోదరి హనుమంతును వివాహం చేసుకొని వెల్లిపోయింది. ఇక అప్పటినుంచి ఆమె ఆచూకీ కొసం నేటివరకు తిరుగని చోటు లేదు.

ఫేస్ బుక్ ద్వారా.....

అక్క జాడ కోసం తల్లడిల్లిపోయాడు. తమ ప్రాంతంలో నివాసముండే మోరి హనుమంతు వెంట అక్క వెళ్లిన విషయం మూడు సంవత్సరాల క్రితం తెలుసుకున్నాడు. హనుమంతు ఆచూకి కోసం ఆ రోజునుంచి వెతకని రోజంటూ లేదు. ఒకరోజు సెల్ ఫోను చేతపట్టుకొని ఫేప్ బుక్ చూస్తూ అతని ఆచూకీ వస్తుందేమో చూద్దాం అంటూ ఫేస్ బుక్ లో హనుమంతు అని టైప్ చేయగానే అతని అకౌంట్ ఓపెన్ అయింది. అందులో ఉపేంద్ర చారి సోదరి ఫోటో ఆమె పిల్లల ఫోటో, హనుమంతు ఫోటో కనిపించింది.. అంతే అక్క ఆచూకీ కోసం ఆరా తీయ్యడం మొదలు పెట్టాడు.

ఫోన్ నెంబరు పట్టుకుని.....

హనుమంతు స్నేహితుల నెంబర్లు తోటి క్యాబ్ డ్రైవర్ల ఫోన్ నెంబర్లు కనిపించాయి. ఇన్నోవా కారు కావాలి అన్నప్పుడు సదరు వ్యక్తి నాకు తెలిసిన వ్యక్తి నెంబర్ ఇస్తాను అంటూ చెప్పాడు. అయితే ఉపేంద్ర చారి చాకచక్యంగా ఇదివరకు ఒకసారి పోయినప్పుడు మోర్ హనుమంతు తమను తెచ్చాడని అతని అడ్రస్ ఫోన్ నెంబర్ ఉంటే తెలపాలంటూ కోరాడు. వెంటనే అవతలివారు హనుమంతు నా స్నేహితుడు అని అతని కారు నెంబర్ ఫోన్ నెంబరు ఇది అంటూ ఇచ్చాడు. బావ హానుమంతు ఫోన్ నెంబరు తెలుసుకున్న ఉపేంద్రచారి ఏమాత్రం ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగి ఉపేంద్ర చారి బయోడేటా వివరాలు అన్నీ సేకరించాడు తన అక్క ఆచూకి లభించింది. ఈ సంతోషం ఎంతసేపు మిగల్లేదు.

సంతోషం నిలవలేదు....

అక్క ఆచూకి లభించింది అని సంతోషంతో టూవీలర్ పై అతను ఉంటున్న ఊరికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళిన తర్వాత బావ హనుమంతు ఇల్లు అడ్రస్ తీసుకుని వెళ్లగా అక్కడ అతని సోదరి కనిపించలేదు. అనుమానంతో ఊరివారిని వివరాలు అడగగా మూడు సంవత్సరాల క్రితం కర్ణాటక నుంచి ఒక అమ్మాయిని తెచ్చాడని తర్వాత ఏమైందో తెలియదని గ్రామస్ధులు సమాచారం ఇచ్చారు. ప్రియను హనుమంతు చంపేశాడని ఆ అమ్మాయికి దిక్కు ఎవరు లేరని తెలిపారు. దీంతో షాక్ గురైన ఉపేందర్ ఒకసారి మోరి హనుమంతుతో మాట్లాడడానికి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఫోన్ చేశాడు. తొమ్మిది సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకొని ఆచూకీ లేకుండా పోయిన అక్క కోసం నిరంతరం వెతుకులాట యువకుడు పడిన తపన అంతా ఇంతా కాదు . కానీచివరికి తేలిందేమిటంటే కట్టుకున్నోడే కాలయముడు అయి అతి దారుణంగా తన అక్కను హత్య చేసి బావిలో పడవేసి ఆమెకు పుట్టిన సంతానాన్ని కొండ మల్లేపల్లి తెలిసినవారికి విక్రయించాడు. పాపను హైదరాబాద్ లో విక్రయించి మరో వివాహం చేసుకుని కాపురం చేస్తున్నాడన్న వాస్తవాన్ని తెలుసుకొని ఎల్బీనగర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

అంగీకరించిన హనుమంతు......

ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ ఆశ్రయించాక వారి సూచన మేరకు నల్గొండ జిల్లా మర్రిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలిసులు ప్రస్తుతం నిందితుడిని హనుమంతును అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘోరం చేసినట్లు అంగీకరించాడు. తన భార్య ప్రియను హత్య చేసి బావిలో పడేశానని, తన ఇద్దరు పిల్లలను విక్రయించానని నిందితుడు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. ప్రస్తుతం నిందితుడు మర్రిగూడ పోలీస్ స్టేషన్ పోలీసుల అదుపులో ఉండగా పిల్లలను తీసుకురాడానికి పోలీసులు మల్లెపల్లి చౌరస్తాకు, హైదరాబాద్ కు బృందాలను పంపారు. ఉపేందర్ అక్కను చంపిన బావిలో పడవేసిన ప్రాంతాన్ని చూసి గుండె అవిసేలా రోదించాడు. ఈకేసును పూర్తిగా దర్యాప్తు జరుపుతున్నారు మర్రిగూడం పోలిసులు.

Similar News