భారత్ లో మంకీ ఫీవర్ కలకలం.. ప్రాణాంతకం అంటున్న వైద్యులు

దేశంలో కరోనా భయంతో ప్రజలు ఆందోళన చెందుతున్న సమయంలో మరో కొత్తవైరస్ తెరపైకొచ్చింది. అయితే ఇది కరోనా రకానికి

Update: 2022-01-22 12:16 GMT

దేశంలో కరోనా భయంతో ప్రజలు ఆందోళన చెందుతున్న సమయంలో మరో కొత్తవైరస్ తెరపైకొచ్చింది. అయితే ఇది కరోనా రకానికి చెందినది కాదు. మంకీ ఫీవర్. దానినే వైద్య భాషలో క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్(కేఎఫ్ డీ) అని పిలుస్తారు. కర్ణాటకలోని షిమెగా గ్రామానికి చెందిన 57 ఏళ్ల మహిళకు ఈ ఫీవర్ సోకినట్లు నిర్థారణ అయింది. బాధిత మహిళ కొద్దిరోజులుగా జ్వరంతో బాధపడుతోంది. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. దాంతో.. శివమొగ్గలోని ప్రభుత్వాస్పత్రిలో చేరింది.

ప్రభుత్వాస్పత్రి వైద్యులు మహిళ నుంచి రక్తనమూనాలు సేకరించి వైద్య పరీక్షలు చేయగా.. ఆమెకు కేఎఫ్ డీ సోకినట్లు నిర్థారణ అయింది. ఈ విషయాన్ని శివమొగ్గ హెల్త్ ఆఫీసర్ రాజేష్ సురగిహళ్లి తెలిపారు. ఈ వైరస్, ప్రధానంగా కీటకాల ద్వారా వస్తుందని, కోతులు, మనుషులపై ప్రభావం చూపుతుందని వైద్యాధికారులు తెలిపారు. ఈ వ్యాధి సోకిన వారికి 12 రోజుల వరకు తీవ్ర చలి జ్వరం, తలనొప్పి, బాడీ పెయిన్స్ వంటి లక్షణాలు ఉంటాయని పేర్కొన్నారు. అలాగే 3 నుంచి 5 వరకూ మరణాల రేటు ఉంటుందని తెలిపారు. ఇది టిక్-బర్న్ వైరల్ హెమరేజిక్ వ్యాధి. ఈ రకం వైరస్ వల్ల మానవులు, కోతుల ప్రాణాలకే ప్రమాదకరమని తెలిపారు.






Tags:    

Similar News