బ్రేకింగ్ న్యూస్: టెక్సాస్ స్కూల్ లో షూటింగ్, 9 మంది విద్యార్థుల మృతి

Update: 2018-05-18 18:31 GMT

సాంటాఫ్, టెక్సాస్ ( Santa fe, Texas ): టెక్సాస్ లోని సాంటాఫ్ ( Santa fe ) హైస్కూల్ లో శుక్రవారం ఉదయం జరిగిన షూటింగ్ లో కనీసం 9 మంది విద్యార్థులు ఒక టీచర్ మరణించారు. శుక్రవారం ఉదయం స్థానిక కాలమాన ప్రకారం 7:30 గంటల సమయములో ఒక విద్యార్థి విచక్షణారహితంగా జరిపిన ఈ కాల్పులలో 10 మంది మృతి చెందగా, పలువురు గాయపడినట్లుగా స్థానిక పోలీసులు తెలియ జేశారు.

పోలీసులు నిందితుని అదుపులోకి తీసుకున్నట్లుగా ధృవీకరించారు. స్కూల్ పరిసర ప్రాంతంలో కొన్ని ప్రేలుడు పదార్థాలు మరియు వాటికి సంబంధించిన పరికరాలు కూడా లభించినట్లుగా సమాచారం అందుతుంది. అప్రమత్థంగా ఉండవలసిందిగా పోలీసులు ప్రజలను కోరారు.

Similar News