శాస్త్ర ప్రకారం ప్రతిష్ట జరగడం లేదు

మరో వారం రోజుల్లో అయోధ్యలో రాముని విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరగనున్న వేళ మరో వివాదం తలెత్తింది. దేశంలోని నాలుగు అద్వైత మఠాలకు చెందిన ఆధిపతులు రామ మందిర పునః ప్రతిష్టకు హాజరు కావడానికి సుముఖంగా లేరు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ శుభ కార్యం జరగడాన్ని దేశం నలువైపులా ఉన్న నాలుగు మఠాలకు చెందిన శంకరాచార్యులు వ్యతిరేకిస్తున్నారు. శాస్త్రం ప్రకారం ప్రాణ ప్రతిష్ట జరగడ లేదని వారు ఆరోపిస్తున్నారు. ప్రధాని గర్భగుడిలో ప్రవేశించడాన్ని మఠాధిపతులు ఆక్షేపిస్తున్నారు.

Update: 2024-01-16 04:39 GMT

Sankaracharyulu not to attend the consecration ceremony in Ayodhya,

మరో వారం రోజుల్లో అయోధ్యలో రాముని విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరగనున్న వేళ మరో వివాదం తలెత్తింది. దేశంలోని నాలుగు అద్వైత మఠాలకు చెందిన ఆధిపతులు రామ మందిర పునః ప్రతిష్టకు హాజరు కావడానికి సుముఖంగా లేరు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ శుభ కార్యం జరగడాన్ని దేశం నలువైపులా ఉన్న నాలుగు మఠాలకు చెందిన శంకరాచార్యులు వ్యతిరేకిస్తున్నారు. శాస్త్రం ప్రకారం ప్రాణ ప్రతిష్ట జరగడ లేదని, ప్రధాని గర్భగుడిలో ప్రవేశించడం సరి కాదని మఠాధిపతులు ఆక్షేపిస్తున్నారు.  

గోవర్ధన పీఠం, జ్యోతిర్మఠాలకు చెందిన నిశ్చలానందస్వామి సరస్వతి, అవిముక్తేశ్వరానందర సరస్వతి ప్రతిష్ట జరుగుతున్న తీరుపై అసంతృప్తి వ్యకం చేశారు. వైదిక సిద్ధాంతాల ప్రకారం రాముడు కొలువు తీరాలని వారు చెబుతున్నారు. ఆలా కానీ పక్షంలో విగ్రహ ప్రభావం క్షీణిస్తుందని, దుష్ట శక్తులు గర్బాలయంలో ప్రవేశిస్తాయని వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ద్వారక, శృంగేరిలో ఉన్న శారదా పీఠాలకు చెందిన అధిపతులు సదానంద సరస్వతి, భారతీ తీర్థ స్వామి మాత్రం ఈ విషయంలో ఇప్పటి వరకూ పెదవి విప్పలేదు. వాళ్లు కూడా ప్రతిష్టకు హాజరయ్యే అవకాశాలు కనిపించడం లేదు.

ఈ విషయం రాజకీయ రంగు కూడా పులుముకుంటోంది. రామాలయ ప్రారంభోత్సవాన్ని భాజపా తన పార్టీ కార్యక్రమంగా మార్చేసిందని, అందుకే మత పెద్దలు కూడా హాజరు కావడం లేదని ఆరోపించింది. ఈ విషయంపై భాజపా తరఫున కేంద్ర మంత్రి నారాయణ రాణే మాత్రం ‘ఇప్పటి వరకూ ఎవరూ చేయలేని పనిని మోదీ చేశారు. దీనికి ఆయనను ఆశీర్వదిస్తారో, శపిస్తారో శంకరాచార్యుల ఇష్టం’ అని వ్యాఖ్యానించారు. మొత్తమ్మీద శంకరాచార్యుల గైర్హాజరు ఓ పెద్ద చర్చకు తెరతీస్తోంది.

Tags:    

Similar News