కృష్ణ జింకలను వేటాడిన కేసులో కండల వీరుడు సల్మాన్ ఖాన్ ను దోషిగా నిర్ధారిస్తూ జోధ్ పూర్ కోర్టు తీర్పు చెప్పింది. దాదాపు 20 ఏళ్ల నాటి ఈ కేసులో సల్మాన్ ఖాన్ ను దోషిగా తేల్చింది.తుది తీర్పులో సల్మాన్ మినహా మిగిలిన వారందరూ నిర్దోషులుగా పేర్కొంది. టబు, సోనాలి, సైఫ్ ఆలిఖాన్, నీలంలను నిర్దోషులుగా ప్రకటించింది. 1998లో హమ్ సాథ్ సాథ్ హై సినిమా షూటింగ్ సందర్భంగా రెండు కృష్ణ జింకలను వేటాడినట్లు సల్మాన్ పై కేసు నమోదు చేసింది. దీనిపై జోథ్ పూర్ కోర్టు తుది తీర్పును వెలువరించింది. సల్మాన్ ను దోషిగా నిర్ధారించింది.