ఎస్పీ అందానికి యువతి ఫిదా...పోలీసులకు చుక్కలు

Update: 2018-06-20 09:20 GMT

ఓ ఎస్పీ అందానికి ఫిదా అయిన యువతి మధ్య ప్రదేశ్ పోలీసులకు చుక్కలు చూపిస్తోంది. మద్యప్రదేశ్ ఉజ్జయినీ ఎస్పీగా పనిచేస్తున్న సచిన్ అతుల్కర్ చూడటానికి సీనిమా హీరోలా ఉంటాడు. దీంతో ఆయనకు సహజంగా ఫాలోయర్లు, ఫ్యాన్సు ఎక్కువ. అయితే, ఫ్యాన్సు యందు నేను వేయా అంటూ ఓ లేడీ ఫ్యాన్ పక్క రాష్ట్రం నుంచి వచ్చి మరీ నానా యాగీ చేస్తోంది. సచిన్ ఫోటోలను పోషల్ మీడియాలో చూసి మనస్సు పారేసుకున్న పంజాబ్ కి చెందిన 27 ఏళ్ల యువతి మద్యప్రదేశ్ లో దిగిపోయింది. తాను ఎలాగైనా ఎస్పీ సచిన్ ను కలవాలని, తన ప్రేమను చెప్పాలని పోలీసులను ముప్పుతిప్పలు పెడుతోంది. దీంతో ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి తిరిగి పంపించేందుకు పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా విఫలమవుతున్నాయి.

రైలు కదలగానే దూకేస్తా...

దీంతో సదరు యువతి తల్లిదండ్రులను ఉజ్జయినీకి పిలిపించినా, వారితో వెళ్లేందుకు ఆ యువతి అంగీకరించడం లేదు. తాను ఎస్పీని కలవాల్సిందేనని భీష్మించుకుని కూర్చుంది. పోలీసులు నచ్చజెప్పి పంజాబ్ ట్రైన్ ఎక్కించేందుకు రైల్వే స్టేషన్ కి తీసుకెళ్లగా, ట్రైన్ కదలగానే దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. ఇక చేసేదేమీ లేక మళ్లీ తీసుకెళ్లారు. అంతేకాదు, తనకు పిజ్జాలు, బర్గర్లు కావాలంటూ పోలీసులు వేయించుకు తింటోంది. అయితే, సైకాలజీలో పీజీ చేస్తున్న ఆ యువతిపై పోలీసుల కౌన్సిలింగ్ ఏ మాత్రం పనిచేయడం లేదు. ఇక ఈ విషయంపై ఎస్పీ సచిన్ కూడా స్పందించారు. అధికారిగా తాను ఎవరినైనా కలుస్తానని, వ్యక్తిగత విషయాల్లో మాత్రం ఇష్టపూర్వకంగానే ఉంటానని స్పష్టం చేస్తున్నారు.

Similar News