బ్రేకింగ్ : కేసీఆర్ కు కౌంటర్

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు ఆర్టీసీ జేఏసీ గట్టి కౌంటర్ ఇచ్చింది. ఆర్టీసీ కార్మికులు తమ బిడ్డలేనంటూ అన్న కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతూనే, చర్చలు లేకుండా [more]

Update: 2019-11-03 06:43 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు ఆర్టీసీ జేఏసీ గట్టి కౌంటర్ ఇచ్చింది. ఆర్టీసీ కార్మికులు తమ బిడ్డలేనంటూ అన్న కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతూనే, చర్చలు లేకుండా ఎట్టి పరిస్థితుల్లో ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరబోరని స్పష్టం చేసింది. తమ డిమాండ్లు పరిష్కారం అయ్యేవరకూ సమ్మె ఆగదని తెలిపింది. అడ్వొకేట్ అబద్ధాలు మాట్లాడారని కేసీఆర్ అబద్ధాలు చెప్పారన్నారు. జీహెచ్ఎంసీ ఆర్టీసీకి డబ్బులు ఇస్తుందని ముఖ్యమంత్రి చట్టం చేశారన్నారు.

ఏకపక్షంగా నిర్ణయాలు…..

ముఖ్యమంత్రి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. ఉద్యోగులను తొలగించే అధికారం ఎవరికీ లేదన్నారు. కమిటీ వేసి తమ డిమాండ్ల పై చర్చించాలన్నారు. తమ సమస్య పరిష్కారంపై ముఖ్యమంత్రి నుంచి ఎటువంటి హామీ లభించలేదన్నారు. తమ డిమాండ్లను పరిష్కరిస్తే యూనియన్లను కూడా రద్దు చేసుకుంటామన్నారు. ఉద్యోగుల పొట్ట కొట్టే ప్రయత్నాన్ని అడ్డుకుంటామన్నారు జేఏసీ నేతలు. నిన్న కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై చర్చించేందుకు, భవిష్యత్ కార్యాచరణ కోసం ఆర్టీసీ జేఏసీ అత్యవసరంగా సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది.

Tags:    

Similar News