ఎప్పటికైనా సీఎం అవుతా...రేవంత్ షాకింగ్ కామెంట్స్

Update: 2018-05-08 14:18 GMT

తన లక్ష్యం సీఎం పదవేనని ఎప్పటికైనా ముఖ్యమంత్రిని అవుతానని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. తనకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అవసరం లేదన్నారు. ఈ విషయాన్ని రాహుల్ కు లేఖ రాస్తానని చెప్పారు. తనను పార్టీలోకి ఆహ్వానించినప్పుడు రాహుల్ దూతలు అనేక హామీలు ఇచ్చారన్నారు. అయితే కాంగ్రెస్ టీం లీడర్ కు సరైన సలహాలు ఇచ్చేవారు లేరన్నారు. తనను కూడా టీం లీడర్ సరిగా వాడుకోవడం లేదని రేవంత్ అభిప్రాయపడ్డారు. తనను వాడుకుంటే కాంగ్రెస్ కే లాభముంటుందన్నారు. తనకు వయసు ఉందని, ఇప్పుడే పదవులు కోరుకోవడంలేదని, సామాన్య కార్యకర్తగా పనిచేస్తానని, ఎప్పిటికైనా సీఎంను అవుతానని ఆయన మీడియా మిత్రుల ముందు చెప్పడం విశేషం.

Similar News