ఇక్కడా ఓట్ల కోసమే.. కేటీఆర్ పై రేవంత్

విశాఖ ఉక్కు ఉద్యమానికి తాము సహకరిస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించడంపై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి [more]

Update: 2021-03-12 00:47 GMT

విశాఖ ఉక్కు ఉద్యమానికి తాము సహకరిస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించడంపై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి కేటీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలను పట్టించుకోకుండా పొరుగు రాష్ట్రంపై కేటీఆర్ కు అంత ప్రేమ ఎందుకో అని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆంధ్ర ఓటర్లను ఆకర్షించడానికే కేటీఆర్ ఈ ప్రకటన చేశారన్నారు. పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతున్నా ఎందుకు ఆందోళనలు చేయడం లేదని రేవంత్ నిలదీశారు. ఉక్కు పోరాటానికి మద్దతు వెనక దురుద్దేశం ఉందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News