సాంకేతిక విప్లవం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అన్ని నష్టాలు వచ్చి పడుతున్నాయి. సామాజిక మాధ్యమాల విజృంభణ ఫలితంగా అనేక అంశాలు క్షణాల్లో ప్రజలకు చేరువ అవుతున్నాయి. ప్రజలను అప్రపత్తం చేయాలిసిన సందర్భాల్లోనూ సోషల్ మీడియా ఉపయోగ పడుతున్నట్లు సంప్రదాయ మీడియా కూడా ఆ వేగాన్ని అందుకోలేకపోతుంది. కానీ అడ్డు అదుపులేని వ్యవస్థలో కొందరు దుర్మార్గులు సృస్ట్టించే పుకార్లు దేశవ్యాప్తంగా అమాయకుల ప్రాణాలు బలిగొంటున్నాయి. పిల్లలను ఎత్తుకుపోయే అపరిచితులు వచ్చేశారంటూ ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ప్రచారం పలువురి ప్రాణాలు తీస్తే మరికొందరు అనేక ప్రాంతాల్లో జనం చేతుల్లో చావు దెబ్బలు తిన్నారు. మాస్ హిస్టీరియా గా మారిన ఈ ఆందోళనకర పరిణామాలను కంట్రోల్ చేయడానికి పోలీసులకు తలప్రాణం తోకకు వచ్చింది. దాంతో కొత్త నియంత్రణ వ్యవస్థకు కేంద్రం ఇప్పుడు శ్రీకారం చుట్టబోతుంది.
దండన ఖాయం ...
వాట్స్ అప్, ఫెస్ బుక్ వంటి సామాజిక ప్రసార మాధ్యమాలను అదుపు చేయడం అంత సులువైన పని కాదు. కానీ వీటిల్లో వచ్చే పుకార్లతో ఆందోళనకర పరిణామాలు సంభవించడాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. పుకార్లను వ్యాప్తి చెందించే వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ సామాజిక మాధ్యమాల్లో అవాంఛిత ప్రచారాలను గుర్తించి ఎవరు పోస్ట్ చేశారు ఎవరు వ్యాప్తి చెందేలా వాటిని రీపోస్టు చేశారు అని గుర్తిస్తుంది. అలా చేసిన వారిపై చట్ట ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుని కేసులు పెట్టాలని కేంద్రం ఆలోచన చేసింది.
ఎప్పటినుంచో నియంత్రించాలన్న డిమాండ్ ..
వాస్తవానికి కేంద్రం నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రజల నుంచి ఎప్పుడో డిమాండ్ వుంది. కానీ ఉత్తరభారత దేశంలో ఇటీవల జరిగిన కొన్ని పుకార్లు సృష్ట్టించిన సంఘటనల నేపథ్యంలో సోషల్ మీడియా పర్యవేక్షణ నియంత్రణ కమిటీని ఎట్టకేలకు ఏర్పాటు చేసింది. దీనికి వాట్స్ అప్ కూడా తన సహకారాన్ని అందించేందుకు ముందుకు వచ్చింది. ఇక పై వాట్స్ అప్ లలో ఫార్వార్డ్ చేసే సమాచారం ఫార్వార్డెడ్ అనే ఆప్క్షన్ ద్వారా అందరికి తెలిసేలా చర్యలు చేపట్టింది. కోట్లాది మంది వుండే సోషల్ మీడియాను చూడాలి ఎంతవరకు తాజాగా ఏర్పడనున్న కమిటీ పుకార్లు షికార్లు చేయకుండా బ్రేక్ లు వేస్తుందో మరి