రాజ్యసభలో డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక ప్రారంభమైంది. ఎన్డీఏ తరుపున జేడీయూ అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్, విపక్షాల తరుపున కాంగ్రెస్ అభ్యర్థి బీ.కే హరిప్రసాద్ పోటీలో ఉన్నట్లు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు. మొత్తం 244 మంది సభ్యులున్న రాజ్యసభలో 123 స్థానాలు సాధిస్తే విజయం వరించినట్లే. ఇందులో వైసీపీకి చెందిన ఇద్దరు సభ్యులు ఓటింగ్ కు దూరంగా ఉంటామని ప్రకటించారు. ఎన్నిక కోసం ఓటింగ్ నిర్వహించారు. . ఇందులో ఎన్డీఏ అభ్యర్ధి హరివంశ్ నారాయణ్ సింగ్ కు 125 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్ధి బీకే హరిప్రసాద్ కు 105 ఓట్లు వచ్చాయి. వైసీపీకి చెందిన ఇద్దరు సభ్యులు ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. దీంతో హరివంశ్ నారాయణ్ సింగ్ గెలిచినట్లు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు. కాంగ్రెస్ అభ్యర్థి బీకే హరిప్రసాద్ కు తెలుగుదేశం సభ్యులు ఓటేయగా, ఎన్డీఏ అభ్యర్ధికి టీఆర్ఎస్ సభ్యులు ఓటేశారు.