రాహుల్ కౌగిలింతనూ వదలని అమూల్

Update: 2018-07-21 12:28 GMT

తాజా పరిణామాలను తన మార్కెటింగ్ కి ఉపయోగించుకోవడంలో డెయిరీ సంస్థ ‘అమూల్’ ముందుంటుంది. దేశానికి సంబంధించి హాట్ టాపిక్ గా మారిన అంశాలపై ఆ సంస్థ ప్రత్యేకమైన కార్లూన్లు వేస్తుంది. అయితే, నిన్న పార్లమెంట్ లో జరిగిన రాహుల్, మోదీ కౌగిలింత, కన్నుకొట్టే సన్నివేశంపైనా ఓ సెటైరికల్ కార్టూన్ వేసి ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ‘‘కౌగిలింతగా ఉందా..? లేదా ఇబ్బందికరంగా ఉందా..?’’ అనే క్యాప్షన్ తో పోస్ట్ చేసిన ఈ కార్టూన్ నెటిజన్లను యమ ఆకట్టుకుంటుంది. కానీ, ఈ ఫోటోలో మోదీని కౌగిలించుకుంటూనే రాహుల్ కన్నుకొట్టినట్లుగా చూపించడం గమనార్హం. నిన్నటి సంఘటనను అన్ని పత్రికలు, టీవీలు ప్రముఖంగా చూపించడం తెలిసిందే.

 

 

Similar News