మీ మాటలు ఎందుకో డౌటు కొడుతున్నాయ్ జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వైఎస్సార్ కాంగ్రెస్ రెబల్ ఎంపీ రఘురామ కృష‌్ణరాజు ఈరోజు మరో లేఖ రాశారు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న [more]

Update: 2021-07-02 03:30 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వైఎస్సార్ కాంగ్రెస్ రెబల్ ఎంపీ రఘురామ కృష‌్ణరాజు ఈరోజు మరో లేఖ రాశారు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి వివాదంపై ఆయన ఈ లేఖలో ప్రస్తావించారు. నదీ జలాల విషయంలో జగన్ చెబుతున్న మాటలపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని రఘురామ కృష‌్ణరాజు అభిప్రాయపడ్డారు. రాజకీయ ప్రయోజనం కోసమే వివాదాలు సృష్టిస్తున్నారన్న అభిప్రాయం ప్రజల్లో నెలకొని ఉందని ఆయన అన్నారు. రెండు రాష్ట్రాల్లో ప్రాజెక్టులను నిర్మాణం చేపట్టే కంపెనీ ఒక్కటేనని, చర్చలతో పరిష్కరించుకోవాలని, వివాదాన్ని పెద్దది చేయవద్దని రఘురామ కృష‌్ణరాజు తన లేఖలో కోరారు.

Tags:    

Similar News