రఘురామకృష్ణంరాజుపై సీబీఐ మరో కేసు నమోదు

పార్లమెంటు సభ్యులు రఘురామకృష్ణంరాజు పై సిబిఐ మరో కేసు నమోదు చేసింది. బ్యాంకులను మోసపూరితంగా నమ్మించి రుణాలు తీసుకున్న ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదు చేసినట్లు సిబిఐ [more]

Update: 2021-03-26 00:42 GMT

పార్లమెంటు సభ్యులు రఘురామకృష్ణంరాజు పై సిబిఐ మరో కేసు నమోదు చేసింది. బ్యాంకులను మోసపూరితంగా నమ్మించి రుణాలు తీసుకున్న ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదు చేసినట్లు సిబిఐ వెల్లడించింది . ఈ మేరకు సిబిఐ కేసు నమోదు చేసి విచారణను ప్రారంభించింది. హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న హిందూ భారత సంస్థ పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుని తీసుకున్న రుణాలను దారి మళ్లించినట్లు విచారణలో బయట పడింది. ఈ నేపథ్యంలో తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకులు కమిటీ గా ఏర్పడి ఎస్బీఐ కి పూర్తిస్థాయి అధికారాన్ని కట్టబెట్టింది. ఈ మేరకు చెన్నై లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రామకృష్ణంరాజు కు చెందిన కంపెనీలపై సిబిఐకి ఫిర్యాదు చేసింది . ఈ ఫిర్యాదు మేరకు రఘురామకృష్ణంరాజు అతని కుటుంబ సభ్యులతో పాటు డైరెక్టర్ల పైన కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది. మొత్తం 237 కోట్ల రుణాను ఎగవేసినట్లు తెలిపిది. ఇండ్ భారత్ పవర్ లిమిటెడ్, డైరెక్టర్ ఎంపి రఘు రామ కృష్ణమ రాజు, ఇతర డైరెక్టర్లు కనుమూరు రమాదేవి, రాజ్ కుమార్ గంటా, దుంపల మధు సూదన రెడ్డి, నారాయణ ప్రసాద్ భాగవతుల, రామచంద్ర అయ్యర్ ల పై కేసు నమోదుఫోర్జరీ పత్రాలు పెట్టి బ్యాంకు రుణాలు పొందినట్లు గుర్తించారు.

Tags:    

Similar News