జాతీయత గురించి చెప్పడానికే వచ్చా

Update: 2018-06-07 15:12 GMT

జాతీయత గురించి అభిప్రాయాన్ని పంచుకోవడానికే తాను ఇక్కడికి వచ్చానని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చెప్పారు. నాగపూర్ లో జరుగుతున్న ఆర్ఎస్ఎస్ తృతీయ వర్ష్ "వర్గ" ముగింపు సమావేశాల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. బుద్ధిజం దక్షిణ మధ్య ఆసియా నుంచి తూర్పు ఆసియా వరకూ విస్తరించిందన్నారు. అనేకమంది యాత్రికులు భారతదేశ ఔన్నత్యాన్ని గురించి చాటారన్నారు. తక్షశిల, విక్రమశిల, నలంద వర్సిటీలు విద్యావ్యాప్తికి ఎంతో కృషి చేశాయన్నారు. వైవిధ్యాన్ని, భిన్నత్వాన్ని మనంగ గౌరివించాలని ప్రణబ్ అభిప్రాయపడ్డారు. దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చింది మౌర్యులేనన్నారు. బహుళతత్వాన్ని అలవర్చుకునే గుణం మన జీవన విధానంలోనే ఉందన్నారు. జాతి, జాతీయత అనే భావన ఐరోపా కంటే ముందు భారత్ లోనే ఏర్పడిందన్నారు. భారతీయత అన్న పదం మహాజనపదాలతో ఏర్పడిందన్నారు. దేశంలో అధ్భుతమైన పరిపాలన విధానాలు, సంప్రదాయాలున్నాయన్నారు. దేశానికి వచ్చిన అనేక జాతులు, సంస్కృతులు ఇక్కడ విలీనమయ్యాయన్నారు.

ప్రణబ్ ను ఎందుకు ఆహ్వానించామంటే....?

ఈ గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరూ భారతీయుడేనని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అభిప్రాయపడ్డారు. భిన్నతంతో ఏకత్వం భారతీయ సంప్రదాయమన్నారు. నాగపూర్ లో జరుగుతున్న ఆర్ఎస్ఎస్ తృతీయ వర్ష్ వర్గ్ ముగింపు సమావేశాల్లో భాగంగా ఆయన ప్రసంగించారు. ఈ ఉత్సవాలకు ప్రముఖులను ఆహ్వానించే సంప్రదాయం ఉందన్నారు. అందుకే ప్రణబ్ ముఖర్జీని ఆహ్వానించామన్నారు. ఆయన అంగీకరించారన్నారు. ప్రణబ్ ను ప్రణబ్ గానే చూడాలని, ఆర్ఎస్ఎస్ ను ఆర్ఎస్ఎస్ గానే చూడాలన్నారు. భారతదేశ అభివృద్ధికి ఆర్ఎస్ఎస్ నిరంతరం పోరాడుతూనే ఉంటుందన్నారు. రాజకీయ వైరుద్థ్యాలున్నా భారతదేశం అభివృద్ధే లక్ష్యమన్నారు. ప్రణబ్ ముఖర్జీతో మంచి స్నేహం ఉందన్నారు మోహన్ భగవత్. ఎందుకు పిలిచారు? ఎదుంకు వెళ్లారన్న చర్చ ప్రస్తుతం అనవసరమన్నారు. తమ ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ప్రణబ్ కు ధన్యవాదాలు తెలిపారాయన.

Similar News