హైదరాబాద్ పోలీసులకు పూనమ్ ఫిర్యాదు

తనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని నటి పూనమ్ కౌర్ హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. యూట్యూబ్ లో [more]

Update: 2019-04-16 13:14 GMT

తనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని నటి పూనమ్ కౌర్ హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. యూట్యూబ్ లో కొన్ని వీడియోలు చేసి తనను కించపరిచే విధంగా చూపుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. గత రెండు సంవత్సరాల నుంచి తన పైన అసత్య ప్రచారం కొనసాగుతుందని, ఇందుకు సంబంధించి 50 యూట్యూబ్ లింకులను సైతం ఆమె పోలీసులకు అందజేసిశారు. తనపై జరుగుతున్న దుష్ర్రచారం మరే ఆడపిల్లకూ జరగకూడదని ఈ ఫిర్యాదు చేశానని ఆమె తెలిపారు. రెండేళ్లుగా తనను మానసిక వేదనకు గురి చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.

Tags:    

Similar News