త్వరలో పెట్రోల్‌ ధరలు తగ్గుదల

త్వరలో పెట్రోల్‌ ధరలు తగ్గనున్నట్లు సమాచారం. అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా, దేశవాసులందరికీ మోదీ ప్రభుత్వం ‘పెట్రోల్‌’ రూపంలో బహుమతి ఇవ్వనున్నట్లు ఢల్లీవర్గాలు చెబుతున్నాయి. పేరుకు ‘అయోధ్య గిఫ్ట్‌’ అని చెబుతున్నా, రాబోయే ఎన్నికలే లక్ష్యంగా పెట్రో ధరల తగ్గింపు అస్ట్రాన్ని భాజపా ప్రయోగించనుంది.

Update: 2023-12-29 00:57 GMT

petrol rates

దేశవాసులకు మోదీ 'అయోధ్య' గిఫ్ట్‌

త్వరలో పెట్రోల్‌ ధరలు తగ్గనున్నాయి. అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా, దేశవాసులందరికీ మోదీ ప్రభుత్వం ‘పెట్రోల్‌’ రూపంలో బహుమతి ఇవ్వనున్నట్లు ఢల్లీివర్గాలు చెబుతున్నాయి. పేరుకు ‘అయోధ్య గిఫ్ట్‌’ అని చెబుతున్నా, రాబోయే ఎన్నికలే లక్ష్యంగా పెట్రో ధరల తగ్గింపు అస్ట్రాన్ని భాజపా ప్రయోగిస్తోంది. 

2021 నవంబర్‌లో ఎన్‌డీఏ సర్కార్‌ పెట్రోల్‌ ధరల్ని భారీగా తగ్గించిన సంగతి తెలిసిందే. లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌ మీద ఒకేసారి పది రూపాయల మేర తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పెరిగిపోతున్న ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి ధరలు తగ్గించాల్సి వచ్చింది. వ్యాట్‌ ఛార్జీలను తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కూడా కేంద్రం కోరింది. పెట్రోల్‌, డీజిల్‌ జీఎస్టీ పరిధిలోకి రాకపోవడంతో... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వాటిపై ట్యాక్స్‌లు వేస్తాయి.ఎన్డీఏ సర్కార్‌ వచ్చిన పదేళ్లలోనే పెట్రోల్‌ రేట్లు కూడా భారీగా పెరగడం గమనార్హం.

అయోధ్యలో రాముని విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ప్రధాని మరిన్ని వరాలు ప్రకటించనున్నట్లు భోగట్టా. 2024లో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా మోదీ పావులు కదుపుతున్నారు. ఇటు స్వామి కార్యం, అటు స్వకార్యం కూడా నెరవేర్చుకునే దిశగా భాజపా సర్కారు అడుగులు వేస్తోంది. 

Tags:    

Similar News