మూడు రాజధానులపై పవన్?

మూడు రాజధానులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఒక్క రాజధానికే దిక్కూ దివాణం లేకుంటే మూడు రాజధానులు జగన్ రెడ్డి నిర్మిస్తారట అని పవన్ కల్యాణ్ [more]

Update: 2019-12-18 01:55 GMT

మూడు రాజధానులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఒక్క రాజధానికే దిక్కూ దివాణం లేకుంటే మూడు రాజధానులు జగన్ రెడ్డి నిర్మిస్తారట అని పవన్ కల్యాణ్ ఎద్దేవా చేశారు. రాజధానిపై నిపుణుల కమిటీ నివేదిక రాకమునుపే జగన్ ప్రకటించడాన్ని ఏమనుకోవాలన్నారు. ఇక నిపుణుల కమిటీ నియమించింది ఎందుకని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. మూడు ప్రాంతాలకు ప్రజలు ఎలా వెళతారన్నారు? సచివాలయానికి అనంతపురం ప్రజలు ఎలా వెళ్లాలని, హైకోర్టుకు కర్నూలు వెళ్లాలంటే శ్రీకాకుళం ప్రజలు ఎన్ని అవస్థలు పడాలని పవన్ కల్యాణ్ నిలదీశారు. అమరావతికి తాళాలు వేసేందుకే జగన్ రెడ్డి మూడు రాజధానుల ఆలోచన చేసినట్లుందన్నారు. ఉద్యోగులు మళ్లీ అమరావతి నుంచి విశాఖపట్నంకు వెళ్లాలా? అని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం అమరావతిని గుర్తించిందని, మరి ఇప్పుడు ఏ రాజధానిని గుర్తించాలన్నారు పవన్ కల్యాణ్. ఒక వ్యూహం ప్రకారమే జగన్ ఈ ప్రకటన చేశారని పవన్ కల్యాణ్ మండిపడ్డారు.

Tags:    

Similar News