ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. చాలా జిల్లాల్లో పార్టీకి సరైన గుర్తింపు ఉన్న నేతలు ఇప్పటిదాకా లేరు. అయితే ఇప్పటికే 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీకి సై అంటూ ప్రకటించేశారు. దాంతో కొన్ని జిల్లాలో పార్టీ నుంచి పోటీ చేసే వారికోసం జనసేనాని తీవ్రంగా అన్వేషణ సాగిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాల సమాచారం. అందులో భాగంగా అధికార టిడిపి, విపక్ష వైసిపి నుంచి బలమైన ద్వితీయ శ్రేణి నేతల వివరాలను పవన్ తెప్పించుకుని పరిశీలించినట్లు తెలుస్తుంది.
గోదావరి జిల్లాల తరువాత ...
గోదావరి జిల్లాల తరువాత రాయలసీమలోకి అడుగుపెట్టాలని పవన్ భావిస్తున్నారటున్నారు. సెప్టెంబర్ మొదటి వారం నుంచి అనంతపురం, కడప, రాయలసీమ ప్రాంతాల్లో టూర్ ఖరారుకు కసరత్తు జనసేనలో మొదలైంది. జనసేనాని టూర్ బలిజ సామాజిక వర్గం అత్యధికంగా నివసించే ప్రాంతాలను కవర్ చేసేలా రూట్ మ్యాప్ ను జనసేన వ్యూహాకర్హలు సిద్ధం చేస్తున్నట్లు తెలియవస్తుంది. సీమ టూర్ లోనే టిడిపి, వైసిపి వర్గాలనుంచి భారీగా వలసలు జరిగేలా ఆయా నాయకులతో చర్చలు సాగుతున్నట్లు చెబుతున్నారు. టిడిపి, వైసిపిలో టికెట్ ఆశించి భంగపడ్డ బలమైన నేతలను జనసేన లోకి తీసుకురావాలని ఈసారి పవన్ టూర్ టార్గెట్ అదే అంటున్నారు. జనసేన తాజా వ్యూహం పై టిడిపి వైసిపిలు ఎలాంటి వ్యూహం అనుసరిస్తాయో చూడాలి.