ఇద్దరూ శత్రువుల్లాగానే....!

Update: 2018-06-22 06:40 GMT

చాలా రోజుల తర్వాత పవన్ కల్యాణ్, చంద్రబాబు ఒకే కార్యక్రమంలో కలిశారు. నంబూరులో జరిగిన దశావతార వెంకటేశ్వర స్వామి ప్రతిష్టకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు వచ్చారు. స్వామివారి ఆలయంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ఇద్దరూ హాజరయ్యారు. చంద్రబాబు, పవన్ ఇద్దరూ పక్కనే చాలా సేపు కూర్చున్నప్పటికీ పలుకరించుకోక పోవడం విశేషం. ఎడమొహ పెడమొహంగా ఉన్నారు. దాదాపు మూడున్నరేళ్లు తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చిన పవన్ కల్యాణ్ ఆరు నెలల క్రితం కటీఫ్ చెప్పేశారు. తన పోరాట యాత్రలో టీడీపీనే టార్గెట్ చేస్తూ వస్తున్నారు. అలాగే చంద్రబాబు కూడా అనేక సభల్లో పవన్ పై సెటైర్లు విసిరారు. కాని స్వామి వారి విగ్రహ ప్రతిష్టలో ఇద్దరూ కలసి పలుకరించుకుంటారని అక్కడి ప్రజలు ఆసక్తిగా చూశారు. కాని వారి ఆశలు నెరవేరలేదు. ఇద్దరూ చాలాసేపు అక్కడే ఉన్నా కనీసం ఒకరి మొహం ఒకరు చూసుకోక పోవడం అక్కడి వారిని ఆశ్చర్యపర్చింది.

Similar News