జనసేన అధినేత పవన్ కల్యాణ్ వామపక్షాలతో భేటీ ముగిసింది. ఈ నెల 6వ తేదీన జాతీయ రహదారులపై పాదయాత్ర నిర్వహించాలని నిర్ణయించారు. ఉదయం పదిగంటలకు అన్ని చోట్ల ఈ పాదయాత్రలు ప్రారంభమవుతాయన్నారు. విభజన హామీల అమలు చేయనందుకు నిరసనగా ఈ పాదయాత్రల్లో పార్టీ శ్రేణులందరూ పాల్గొనాలని పవన్ పిలుపు నిచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో బీజేపీ మోసం చేసిందన్నారు. అవిశ్వాసం పై చర్చకు రాకుండా ప్రభుత్వం అడ్డుకుంటుందన్నారు. జాతీయ రహదారులు లేని ప్రాంతాల్లో ముఖ్యమైన రోడ్లలో పాదయాత్రలు చేయాలన్నారు. టీడీపీ, వైసీపీలు కేవలం విమర్శలకే పరిమితమయ్యాయన్నారు. కేంద్రంపై వత్తిడి తేవడంలో విఫలమయ్యాయన్నారు పవన్ కల్యాణ్. ప్రత్యేక హోదా కోసం తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని చెప్పారు. ఈ సమావేశంలో సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ, మధు పాల్గొన్నారు. ఈ పాదయాత్రలు మొదటి హెచ్చరిక మాత్రమేనని వారు చెప్పారు.