పరకాల దెబ్బకొట్టారే ...!

Update: 2018-06-19 10:36 GMT

ఏపీ ప్రభుత్వ ముఖ్యమంత్రి సలహాదారు డా. పరకాల ప్రభాకర్ తన పదవికి రాజీనామా చేసేసారు. డా. పరకాల తన రాజీనామా తక్షణం ఆమోదించాలని కూడా సిఎం ను కోరారు. ఎందుకు రాజీనామా చేయాలిసి వచ్చిందో తన లేఖలో సుదీర్ఘంగా ప్రస్తావించారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన నాటినుంచి సర్కార్ పాలనలో డా. పరకాల కు ప్రధాన సలహాదారు పదవితో పాటు అత్యంత ప్రాధాన్యం కల్పించారు ముఖ్యమంత్రి. బాబు విదేశీ పర్యటనలతో పాటు కేబినెట్ సమావేశాల్లోనూ ప్రభాకర్ పాల్గొనేవారు. గత ఆరునెలలుగా పరకాలకు సిఎం ప్రాధాన్యం తగ్గిస్తూ వచ్చారన్న ప్రచారం నడిచింది.

అందువల్లే రాజీనామా ...

ముఖ్యమంత్రి చంద్రబాబు, డా . పరకాల జోడి చాలా చక్కటి సమన్వయంతో సాగేది. కానీ ఇటీవల బిజెపితో , ఎన్డీయేతో చంద్రబాబు తెగతెంపులు చేసుకున్నాకా విపక్షాలనుంచి పరకాలపై విమర్శలదాడి పెరుగుతూ వచ్చింది. ప్రభాకర్ సతీమణి నిర్మలా సీతారామన్ కేంద్ర కేబినెట్ లో రక్షణ మంత్రిగా వున్న నేపథ్యంలో టిడిపి సర్కార్ కొలువులో ఆయనకు ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. ఇది కాక జాతీయ మీడియా వ్యవహారాలు, రాష్ట్ర స్థానిక అంశాలను ఎన్ గ్రూప్ అనే సంస్థకు బాబు కట్టబెట్టారని మాజీ ఐఏఎస్ గా వున్న లక్ష్మీనారాయణ కు ఈ వ్యవహారాలు అప్పగించిన నాటినుంచి డా . పరకాల అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఈనేపథ్యంలోనే పలు కారణాల రీత్యా సలహాదారు పదవికి రామ్ రామ్ చెప్పారని అమరావతిలో టాక్.

Similar News