పండుగ వేళ పాక్ పైశాచికం

Update: 2018-06-16 06:21 GMT

పండుగ వేళ కూడా పాకిస్థాన్ పైశాచిక బుద్ధిని బయటపెట్టుకుంది. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా జమ్మూ కశ్మీర్ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు భారత్ సైన్యం కాల్పుల విరమణ పాటిస్తుంటే పాకిస్థాన్ మాత్రం బుద్ది మార్చుకోవడం లేదు. రంజాన్ మాసంలో ఇప్పటికే 10 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లఘించి కాల్పులు జరిపిన పాక్ సైన్యం ఇవాళ పండుగ రోజు కూడా కాల్పులు జరిపింది. భారత్-పాక్ సరిహద్దులోని ఆర్నియా సెక్టార్ లో తెల్లవారు జాము నుంచి పాక్ భారత్ వైపు కాల్పులు జరుపుతున్నట్లు భారత ఆర్మీ తెలిపింది. అయితే, పండుగల వేళ భారత్-పాక్ సైనికులు పరస్పరం మిఠాయిలు పంచుకునే సంప్రదాయం గత కొన్నేళ్లుగా వస్తుంది. కానీ, ఇవాళ ముస్లింల పవిత్ర రోజైన రంజాన్ నాడు ప్రతీ సంవత్సరం భారత్-పాక్ సైనికులు మిఠాయిలు పంచుకుంటారు. కానీ, పాక్ కాల్పుల వల్ల ఈ సారి ఇరుదేశాల సైనికులు ఎటువంటి వేడుకలు చేసుకోవడం లేదు.

Similar News