బ్రేకింగ్ : ఏపీలో ఆగని కరోనా వైరస్.. ఈ ఒక్కరోజే?

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాధి ఆగడం లేదు. ఏపీలో కొత్తగా గడిచిన 24 గంటల్లో 222 కేసులు నమోదయ్యాయి. ఇద్దరు మృతి చెందారు. దీంతో ఆంధ్రప్రదేశ్ [more]

Update: 2020-06-13 08:00 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాధి ఆగడం లేదు. ఏపీలో కొత్తగా గడిచిన 24 గంటల్లో 222 కేసులు నమోదయ్యాయి. ఇద్దరు మృతి చెందారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,588కి చేరింది. ఏపీలో ప్రస్తుతం 1865 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకూ ఏపీలో కరోనా కారణంగా 82 మంది మృతి చెందారు. ప్రతిరోజూ 200కు తగ్గకుండా కేసులు నమోదవుతుండటం ఆందోళన కల్గిస్తుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. 2641 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు.

Tags:    

Similar News