మోదీ ఉచ్చులో ప్రతిపక్షాలు

అయోధ్య అంశాన్ని రాజకీయం చేయడంలో, ప్రతిపక్షాలను సంకట స్థితిలో నెట్టడంలో మోదీ అండ్‌ టీం సక్సెస్‌ అయినట్లే కనిపిస్తోంది. ప్రతిపక్ష నేతల్లో ఎక్కువమంది రామాలయ పున:ప్రతిష్టకు రాలేమని తేల్చి చెప్పారు. ఇది భాజపా, ఆరెస్సెస్‌ కార్యక్రమమని అందుకే రాబోమని చెబుతున్నారు. ఈ విషయంలో వారు చారిత్రక తప్పిదం చేసినట్లేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ప్రతిష్టాపనకు వెళ్లకపోవడం ద్వారా వాళ్లు కొన్ని వర్గాల వారిని శాంతింపచేయవచ్చు.

Update: 2024-01-17 12:35 GMT

Opposition parties will be in defence after denying going to the consecration ceremony in Ayodhya,

2024కు నీళ్లొదుకోవాల్సిందేనా!

అయోధ్య అంశాన్ని రాజకీయం చేయడంలో, ప్రతిపక్షాలను సంకట స్థితిలో నెట్టడంలో మోదీ అండ్‌ టీం సక్సెస్‌ అయినట్లే కనిపిస్తోంది. ప్రతిపక్ష నేతల్లో ఎక్కువమంది రామాలయ పున:ప్రతిష్టకు రాలేమని తేల్చి చెప్పారు. ఇది భాజపా, ఆరెస్సెస్‌ కార్యక్రమమని అందుకే రాబోమని చెబుతున్నారు. ఈ విషయంలో వారు చారిత్రక తప్పిదం చేసినట్లేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ప్రతిష్టాపనకు వెళ్లకపోవడం ద్వారా వాళ్లు కొన్ని వర్గాల వారిని శాంతింపచేయవచ్చు. మెజారిటీ హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని ఆలోచించడం లేదు. ఒకవేళ హిందువులు పట్టించుకోకపోయినా, గుర్తు చేసి గుచ్చడానికి భాజపా రెడీగా ఉంది. ఆ పార్టీకి కూడా ఇదే కావాల్సింది. రామమందిర ప్రతిష్టనే కాదు, ప్రతిపక్ష్షాల గైర్హాజరీని కూడా మోదీ తనకు కన్వీనియంట్‌గా వాడుకుంటారు. మీడియా ప్రాపగాండా విషయంలో ఆయనను మించిన వాళ్లు లేరు.

కాంగ్రెస్‌ రాజమాత సోనియా గాంధీ, అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా సీనియర్‌ నేతలంతా ప్రతిష్టకు వెళ్లడం లేదు. భాజపా కార్యక్రమం కాబట్టి వెళ్లడం లేదని చెప్పారు. సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖలేష్‌ యాదవ్‌.. తనకు బీసీ, ఎస్సీ, ఎస్టీలే దేవుళ్లని, అందుకే రామమందిర ప్రారంభానికి వెళ్లనని చెబుతున్నారు. ఆయనతో పాటు, శశిథరూర్‌ లాంటి కాంగ్రెస్‌ నేతలు ప్రతిష్ట అయిన తర్వాత వెళ్తామని చెప్పారు. ముహూర్తానికి వెళ్తే ఏంటి సమస్యో వాళ్లే చెప్పాలి. సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన డీఎంకే వారసుడు ఉదయనిధి ఇప్పుడు నిశ్శబ్దంగా ఉన్నారు. గుళ్లు గోపురాలు తిరిగే స్టాలిన్‌ భార్యకు భాజపా ఆహ్వానం పంపింది. అక్కడ నుంచి స్పందన ఉండకపోవచ్చు. మమతా బెనర్జీ, శరద్ పవార్ కూడా వెళ్లడం లేదు. హిందువుల ఆగ్రహానికి గురి కాకుండా తమ రాష్ట్రాల్లోనే ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. 

భాజపా హయాంలోనే అయోధ్యపై రామ్‌మందిర ట్రస్ట్‌కు పాజిటివ్‌గా సుప్రీం కోర్ట్‌ తీర్పు ఇచ్చింది. ఈ నాలుగేళ్లలోనే మందిర నిర్మాణం కూడా పూర్తయింది. ఇవన్నీ కాదనలేని నిజాలే. కానీ అయోధ్యను నిర్మించింది భాజపా కాదు. హిందువులంతా కూడా భాజపా కార్యకర్తలు కాదు. ఈ విషయాన్ని ప్రతిపక్షం గుర్తించడం లేదు. తమ ప్రయోజనాలను భాజపా, ఆరెస్సెస్‌ మాత్రమే కాపాడగలవని హిందువులను నమ్మించడంలో మోదీ గణం పూర్తిగా సక్సెస్‌ అయింది. గతంలో న్యూట్రల్‌గా ఉన్న హిందువులు కూడా ఇప్పుడు భాజపా వైపు మళ్లుతున్నారు. ఈ ట్రెండ్‌ ఉత్తరాదిలో చాలా ఎక్కువగా ఉంది. ఈ ప్రభావం లోక్‌సభ ఎన్నికలపై ఖచ్చితంగా ఉంటుంది.

కొన్ని పార్టీలు, కొన్నాళ్లు మైనారిటీల ప్రాపకం కోసం పాకులాడితే, భాజపా మెజారిటీ హిందూ ఓట్లను పోలరైజ్‌ చేసుకుంటోంది. ఎన్నికల ప్రచారంలో రామమందిర ప్రారంభోత్సవానికి రాకపోవడంపై కమలం నేతలు అడిగే ప్రశ్నలకు ప్రతిపక్షాలు ముందే సమాధానాలు సిద్ధం చేసుకోవాలి. రామాలయ నిర్మాణం కంటే దేశంలో చాలా సమస్యలు ఉన్నాయని కన్విన్స్‌ చేయగలగాలి. 60 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు మీరేం చేశారు అని భాజపా అడిగితే.. కౌంటర్‌ ఇవ్వగలగాలి. లేదంటే 2024కు నీళ్లొదులుకుని, 2029లో అధికారం సాధించడానికి ఇప్పట్నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి.

Tags:    

Similar News