ఎన్నికల వేళ కాంగ్రెస్ సీనియర్ నేతలు మరోసారి?

మరోసారి సీనియర్ నేతలు కాంగ్రెస్ అధిష్టానంపై విరుచుకుపడ్డారు. 23 మంది సీనియర్ కాంగ్రెస్ నేతలు జమ్మూలో సమావేశమై తమ ఆలోచనలను పంచుకున్నారు. ఆజాత్ అనుభవాన్ని పార్టీ ఉపయోగించుకోవడం [more]

Update: 2021-02-28 03:48 GMT

మరోసారి సీనియర్ నేతలు కాంగ్రెస్ అధిష్టానంపై విరుచుకుపడ్డారు. 23 మంది సీనియర్ కాంగ్రెస్ నేతలు జమ్మూలో సమావేశమై తమ ఆలోచనలను పంచుకున్నారు. ఆజాత్ అనుభవాన్ని పార్టీ ఉపయోగించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. జీ 23 పేరుతో వీరిని పిలుచుకుంటున్నారు. రోజురోజుకూ కాంగ్రెస బలహీనపడుతుందని సీనియర్ నేతలు ఆవేదన చెందారు. కాంగ్రెస్ బలహీనపడితే దేశమే బలహీనపడుతుందని వారు పేర్కొన్నారు. పార్టీని బలోపేతం చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో గులాం నబీ ఆజాద్, ఆనంద శర్మ, కపిల్ సిబాల్, రాజ్ బబ్బర్ తదితరులు పాల్గొన్నారు. శాంతి సమ్మేళన్ పేరుతో జమ్మూలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ కాంగ్రెస్ లో కీలక పరిణామం సంభవించింది.

Tags:    

Similar News