పరేషాన్ లో మంత్రి పితాని

Update: 2018-07-11 14:29 GMT

నిబంధనలకు విరుద్ధంగా రొయ్యల చెరువులు తవ్వారనే ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి పితాని సత్యానారాయణపై రాష్ట్ర మత్య్స శాఖ సీరియస్ అయ్యింది. పశ్చిమ గోదావరి జిల్లా కొవూరు మండలం కొమ్ము చిక్కాలలో ఆయనకు ఎకరం 15 సెంట్ల స్థలంలో రొయ్యల చెరువులు ఉన్నాయి. అయితే, వీటి తవ్వకాల్లో నిబంధనలు తుంగలో తొక్కారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో వ్యవసాయ భూములుగా ఉన్న ఈ స్థలంలో చేపల చెరువుల కోసం అనుమతులు తీసుకుని రొయ్యల చెరువులు ఏర్పాటుచేశారు. మంత్రితో పాటు మరికొందరు కూడా ఇలానే నిబంధనలను పాటించలేదు. దీంతో వీరి రొయ్యల చెరువులను కూల్చేస్తామని మత్య్స శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు మంత్రితో పాటు మరో 89 మందికి కూడా నోటీసులు జారీ చేసింది.

Similar News