చివరి ప్యాకేజీలో ఏడు రంగాలకు ప్రాధాన్యత

ఇరవై లక్షల కోట్ల ప్యాకేజీలో చివరి ప్యాకేజీని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పేదల, వలస కూలీల ఆకలిని తీర్చడం ప్రభుత్వ బాధ్యత అని నిర్మల [more]

Update: 2020-05-17 06:25 GMT

ఇరవై లక్షల కోట్ల ప్యాకేజీలో చివరి ప్యాకేజీని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పేదల, వలస కూలీల ఆకలిని తీర్చడం ప్రభుత్వ బాధ్యత అని నిర్మల తెలిపారు. ఇప్పటికే రాష్ట్రాలకు తగిన సాయం అందించామని చెప్పారు. కరోనా సంక్షోభాన్ని అనుకూలంగా మలుచుకుంటున్నామని చెప్పారు. సమస్యల నుంచి స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యమని తెలిపారు. మే 16వ తేదీ వరకూ రెండువేల నగదును రైతుల ఖాతాల్లో జమ చేశామని నిర్మల చెప్పారు. 20 కోట్ల మంది మహిళలకు లబ్ది చేకూరిందన్నారు. ఇప్పటి వరకూ 3 వేల కోట్ల నగదు బదిలీ చేసినట్లు నిర్మల తెలిపారు. 8.19 కోట్ల మంది రైతులకు సాయం అందించామని చెప్పారు. జనధన్ ఖాతాల్లో 10,025 కోట్ల నగదును బదిలీ చేసినట్లు వివరించారు. వలస కూలీల తరలింపులో 85 శాతం వ్యయం కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. చివరి ప్యాకేజీలో ఏడు రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు నిర్మల సీతారామన్ ప్రకటించారు. ఉపాధిహమీ, హెల్త్, ఎడ్యుకేషన్, కరోనా నియంత్రణపై ఫోకస్ పెట్టినట్లు ఆమె తెలిపారు. నిత్యావసర వస్తువుల కోసం 3,750 కోట్లు కేటాయించామన్నారు. రాష్ట్రాలకు 4,100 కోట్లు విడుదల చేశామన్నారు. పీపీఏలు, కిట్ల కొనుగోలుకు ఈ మొత్తాన్ని కేటాయించామన్నారు. మొత్తం పదిహేను వేలకోట్లను విడుదల చేసినట్లు తెలిపారు.

Tags:    

Similar News