బ్రేకింగ్ : వారికి ఉరే సరైనది

Update: 2018-07-09 09:08 GMT

నిర్భయ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పును ప్రకటించింది. ఈకేసులో నిందితులకు మరణశిక్షను ఖరారు చేస్తూ సుప్రీం కోర్టు ధర్మాసనం తీర్పు చెప్పింది. కిందికోర్టు ఇచ్చిన మరణ శిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలంటూ నిందితులు వేసుకున్న పిటీషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఢిల్లీ హైకోర్టు సహా కిందికోర్టులు ఇచ్చిన తీర్పులను సుప్రీం సమర్థించింది. 2012 లో ఢిల్లీలో నిర్భయపై దుండగులు అత్యాచారం జరిపిన విషయం తెలిసిందే. ఈ కేసులోమొత్తం ఆరుగురు నిందితులు కాగా, ఒక నిందితుడు జైలులోనే ఆత్మహత్య చేసుకోగా, మరో నిందితుడు మైనర్ కావడంతో జువైనల్ హోంలో మూడేళ్ల శిక్ష పొంది విడుదలయ్యాడు. మిగిలిన వారిలో ముగ్గురు నిందితులు తమ మరణశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలంటూ సుప్రీంలో పిటీషన్ వేశారు. ముఖేష్ సింగ్, పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మలకు మరణశిక్ష ఖరారు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.

Similar News