నిమ్మగడ్డ కేసులో క్లారిటీ వస్తుందా?

రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటీషన్ పై నేడు విచారణ జరగనుంది. నేడు న్యాయస్థానంలోనే నేరుగా ఈ కేసును విచారించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ [more]

Update: 2020-05-04 03:02 GMT

రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటీషన్ పై నేడు విచారణ జరగనుంది. నేడు న్యాయస్థానంలోనే నేరుగా ఈ కేసును విచారించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సాంకేతిక కారణాలు తలెత్తడంతో ఈ కేసును న్యాయస్థానంలోనే విచారించాలని ధర్మాసనం నిర్ణయించింది. ఈ మేరకు న్యాయవాదులకు, పిటీషనర్లకు పాసులు మంజూరు చేసింది. తనను తొలగించడం రాజ్యాంగ విరుద్ధమంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టులో పిటీషన్ వేశారు. ఆయనతో పాటు మరికొందరు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటీషన్లపై నేడు విచారించి తుది తీర్పు వెల్లడించే అవకాశముంది.

Tags:    

Similar News