ఆ స్కాంకు హైదరాబాద్ తో లింకు

కేరళ గోల్డ్ స్కాం కేసులో హైదరాబాద్ లింకులు ఉన్నట్టుగా దర్యాప్తు సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. హైదరాబాద్ నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు దుబాయ్ కి వెళ్ళినట్టుగా [more]

Update: 2020-07-20 02:38 GMT

కేరళ గోల్డ్ స్కాం కేసులో హైదరాబాద్ లింకులు ఉన్నట్టుగా దర్యాప్తు సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. హైదరాబాద్ నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు దుబాయ్ కి వెళ్ళినట్టుగా ఎన్ఐఏ అధికారులు అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించి కొన్ని ఆధారాలు లభ్యం అయినట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు దీనికి సంబంధించి ఈడి కూడా ఇప్పటికే సమగ్ర దర్యాప్తు చేస్తుంది . ఈడి కూడా ఇదే వాదనను బలపరుస్తోంది.. ఎందుకంటే హైదరాబాద్ నుంచి దుబాయ్ కి హవాలా దారా డబ్బులు వెళ్లి ఉండవచ్చునని, ఇందుకు సంబంధించి రెండు బృందాలను ఇప్పటికే అధికారులు హైదరాబాద్ పంపించినట్టు గా చెప్తున్నారు. అయితే హైదరాబాద్ లో ఎక్కడ, ఎవరి ద్వారా ఈ నిధులు దుబాయ్ కి వెళ్లి అన్నదానిపై తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ స్కాం కు సంబంధించి కేరళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి తో పాటు పలువురు అధికారులు కు సంబంధం ఉన్నట్లుగా విచారణ కొనసాగుతోంది. ఈ స్కాం లో లో ఇప్పటికే స్వప్న సురేష్, నాయర్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. దీనిపై జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ చేస్తుంది. 30 కిలోల బంగారాన్ని ఫ్లైట్ ద్వారా కేరళ కి బంగారాన్ని తీసుకు వచ్చినట్లుగా పూర్తి ఆధారాలతో కేసు నమోదు చేసింది.

Tags:    

Similar News