కర్నూలులో నయీమ్ రైట్ హ్యాండ్..?

నయీమ్ ముఖ్య అనుచరుడు, అతడికి కుడిభుజంగా కొనసాగిన శేషన్న జాడ తెలుసుకునేందుకు సిట్ వేటాడుతోంది. నయీం హతమై రెండేళ్లు గడిచినా శేషన్న ఆచూకీ మాత్రం ఇంతవరకూ దొరకలేదు. [more]

Update: 2019-04-18 06:45 GMT

నయీమ్ ముఖ్య అనుచరుడు, అతడికి కుడిభుజంగా కొనసాగిన శేషన్న జాడ తెలుసుకునేందుకు సిట్ వేటాడుతోంది. నయీం హతమై రెండేళ్లు గడిచినా శేషన్న ఆచూకీ మాత్రం ఇంతవరకూ దొరకలేదు. పోలీసులకు దొరకకుండా స్థావరాలు మార్చుకుంటున్న శేషన్న ప్రస్తుతం కర్నూలు జిల్లాలో ఉన్నాడనే సమాచారం పోలీసులకు అందింది. అక్కడ ఓ సన్నిహితుడి ఇంట్లో శేషన్న తలదాచుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. శేషన్న స్వస్థలం మహబూబ్ నగర్ లోని అచ్చంపేట కావడం పక్క జిల్లా అయిన కర్నూలులో ఆయన దాక్కున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. నయీమ్ కు సంబంధించి మరింత సమాచారం శేషన్నకు తెలిసి ఉంటుందని పోలీసులు అనుకుంటున్నారు. శేషన్న వద్ద పెద్ద మొత్తంలో ఆయుధాలతో పాటు నగదు డంప్ కూడా ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. శేషన్నని పట్టుకునేందుకు సిట్ అధికారులు రంగంలోకి దిగారు. ఆతడినిక త్వరలోనే పట్టుకునే అవకాశం ఉంది.

Tags:    

Similar News