ఒవైసీ మోదీకి కూడా దోస్తీ కట్టేశారే

Update: 2018-12-20 03:38 GMT

నారా చంద్రబాబునాయుడు ఎప్పుడు ఎలా స్పందిస్తారో ఎవరికి తెలియదు. తనకు శత్రువులైన వారందరినీ ఒక గాటనే కట్టేస్తారు. వారి మధ్య బంధం ఉందని బలంగా చెబుతారు. నిన్న మొన్నటి వరకూ జగన్, పవన్ కల్యాణ‌్, మోదీ మిత్రులంటూ ప్రతి సభలోనూ చెప్పేశారు. తెలంగాణ ఎన్నికల అనంతరం ఈ జట్టులో కేసీఆర్ ను కలిపేశారు. తాజాగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీని కూడా ఈ గ్రూపులో జాయిన్ చేసేశారు. అసదుద్దీన్ కు, మోదీకి అసలు దోస్తీ ఎలా కుదురుతుందనేదే ఇక్కడ అర్థంకాని ప్రశ్న.

ఇదేం లెక్క.....

బాబు లెక్క ప్రకారం అసదుద్దీన్ ఒవైసీ జగన్ కు మద్దతు ప్రకటించడంతో ఆయన్ను కూడా మోదీ జట్టులో కలిపేయాలని బాబు నిర్ణయించుకుంది. తెలుగుదేశం పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో ఇదే విషయాన్ని చెప్పడం ఆ పార్టీనేతలకే విస్మయం కలిగించింది. మోదీ అమరావతిని మరో గుజరాత్ కాకూడదని, అలాగే కేసీఆర్ హైదరాబాద్ లా కాకూడదని కుట్రలు పన్ను తున్నారన్నారు. ఇంతవరకూ బాగానే ఉన్నా మోదీ కనుసన్నల్లోనే జగన్, ఒవైసీ దోస్తీ కుదిరిందని చెప్పడంతో టీడీపీ నేతలు జుట్టుపీక్కుంటున్నారట. సాధ్యాసాధ్యాలను కూడా ఆలోచించకుండా చంద్రబాబు ఎన్నికల్లో విజయానికి ఎవరితోనైనా బంధాన్ని కలిపేందుకు సిద్ధపడతారన్నది ఒవైసీ ఉదంతమేనని తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారు.

Similar News