శభాష్...అన్న చంద్రబాబు

Update: 2018-07-25 04:22 GMT

రాజ్యసభలో చర్చ ద్వారా దేశ ప్రజలను మెప్పించగలిగామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభిప్రాయ పడ్డారు. రాజ్యసభలో ఎంపీలు పోరాడిన తీరును ఆయన ప్రశంసించారు. చంద్రబాబు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎంపీలతో టెలికాన్ఫరెన్స్ ను నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి చేసిన మోసాన్ని రాజ్యసభ లో ఎండగట్టడంలో ఎంపీలు సక్సెస్ అయ్యారని చంద్రబాబు అభినందించారు. తాను ప్రత్యేక హోదా విషయంలో ఎప్పుడూ రాజీపడలేదని చెప్పారు. ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం పోరాటం కొనసాగించాలని చంద్రబాబు ఎంపీలకు సూచించారు. బీజేపీ మినహా అన్ని పార్టీలు తమ పోరాటానికి మద్దతిచ్చాయన్నారు. అనేక పార్టీల సహకారాన్ని కూడగట్టగలిగామన్నారు.

Similar News