ఇప్పటికి అధికారంలోకి ఆయన వచ్చి నాలుగేళ్ళు అయ్యింది. అయినా రాష్ట్ర అభ్యున్నతికి మొన్నటిదాకా సంకల్పం తీసుకోలేదని తేలిపోయింది. అలాగే నవ నిర్మాణానికి సైతం నాలుగేళ్ళ తరువాత దీక్ష తీసుకుంటారా అంటూ ఎద్దేవా చేస్తూ పంచ్ ల మీద పంచ్ లు విసిరారు మాజీ మంత్రి వైసిపి సీనియర్ నాయకుడు ధర్మాన ప్రసాద రావు. ఎపి లో రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి ప్రభుత్వ ఖర్చుతో చేస్తున్న ప్రజా సంకల్పం, నవ నిర్మాణ దీక్షలపై ధర్మాన ఈ సెటైర్లు విసరడం గమనార్హం. గత నాలుగేళ్ళుగా రాష్ట్రానికి ఏమి చేయలేదని ఆయన తాజా సంకల్పాలు, నవనిర్మాణ దీక్షలు చాటి చెబుతున్నాయని అవే సాక్ష్యమంటున్నారు ధర్మాన. వాస్తవానికి ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన రోజే సంకల్పం తీసుకుంటారని, కానీ బాబు మాత్రం అందరికన్నా వెరైటీ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు ఆయన. నాలుగేళ్ళతరువాత దీక్షలు సంకల్పాలకు అర్ధాలను ముఖ్యమంత్రే చెప్పాలని ధర్మాన నిలదీశారు.
మొత్తం 280 కిలోమీటర్లు 16 నియోజకవర్గాలు ...
తూర్పు గోదావరి జిల్లాలో వైఎస్ జగన్ టూర్ మ్యాప్ ప్రకటించారు ఆ పార్టీ సీనియర్ నేత ఎంపీ వైవి సుబ్బారెడ్డి. ఈనెల 12 మధ్యాహ్నం వైసిపి అధినేత జగన్ పాదయాత్ర తూర్పు గోదావరి జిల్లాలో ప్రవేశిస్తుంది. మొత్తం 16 నియోజకవర్గాల మీదుగా జగన్ 280 కిలో మీటర్ల దూరం పాదయాత్ర చేయనున్నారు. రాజమండ్రి, అమలాపురం, కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా టూర్ ను ప్లాన్ చేశారు వైసిపి నేతలు. రోజుకు 13 నుంచి 15 కిలోమీటర్ల దూరం జగన్ నడుస్తారని అన్ని వర్గాల ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలు వింటారని వైసిపి వర్గాలు తెలియచేశాయి. జగన్ టూర్ కు సంబంధించి ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు సుబ్బారెడ్డి వెల్లడించారు.