ఐటి అంటే చంద్రబాబు ... చంద్రబాబు అంటే ఐటి. ఇది హైదరాబాద్ ను బాబు ఏలిన రోజుల్లో నడిచిన టాక్. కానీ ఇప్పుడు చంద్రబాబు ఐటి వింగ్ ను ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ క్యాప్చర్ చేసేలా కనిపిస్తున్నారు. ఇప్పటికే వైసిపి ఐటి వింగ్ టిడిపి ఐటి వింగ్ ను ముప్పుతిప్పలు పెట్టేస్తుంది. వైసిపి జోరుకు బ్రేక్ లు వేయడానికి కొందర్ని టిడిపి సర్కార్ అరెస్ట్ లు కూడా చేయించింది అంటే సోషల్ మీడియా లో ఆ పార్టీ స్పీడ్ చెప్పకనే చెప్పేయొచ్చు. తెలుగుదేశం పార్టీలో కానీ, ప్రభుత్వం లో కానీ ఏ చిన్న తప్పు దొరికినా దొర్లినా వైసిపి సోషల్ మీడియా వింగ్ ఒక ఆట ఆడిస్తుంది. ఇలా పోటా పోటీగా పార్టీలు సోషల్ మీడియా లో దూసుకుపోతున్నాయి.
బెంగళూరు ఐటి వింగ్ తో జగన్ భేటీ ...
ఇదిలా ఉంటే ప్రజాసంకల్ప పాదయాత్రలో తూర్పుగోదావరి జిల్లా రాజోలు లో పర్యటిస్తున్న జగన్ వైసిపి ఐటి వింగ్ విభాగం తో ప్రత్యేకంగా సమావేశం కావడం చర్చనీయాంశం గా మారింది. వీరంతా బెంగళూరు నుంచి రావడం జగన్ వారితో భేటీ అయ్యి ఏ అంశాలపై చర్చించి వుంటారు అన్నది ఆసక్తికరమైంది. అయితే వైసిపి చీఫ్ పార్లమెంట్ సభ్యుల రాజీనామాలను టిడిపి తేలిక చేసి చేస్తున్న యాగీ ని ఖండించాలని కోరినట్లు సమావేశం అనంతరం ఐటి వింగ్ సభ్యులు చేసిన వ్యాఖ్యలను బట్టి తెలుస్తుంది. హోదాపై చంద్రబాబు ఇప్పటికే 40 సార్లు యూటర్న్ లు తీసుకున్నారని సాఫ్ట్ వేర్ నిపుణులు హార్డ్ కామెంట్స్ చేశారు. పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామాలు చేయడం చిన్న విషయం కాదని ఆ త్యాగాన్ని ప్రజలు గుర్తించారని వారు పేర్కొన్నారు. దీనిని బట్టి జగన్ వైసిపి ఐటి వింగ్ స్పీడ్ మరింత పెంచేలా బూస్ట్ అప్ ఇచ్చినట్లు తెలియవస్తుంది. దీనికి టిడిపి ఐటి విభాగం ఎలా సన్నద్ధం అవుతుందో చూడాలి.