భాజపాలో ఏపీ మాజీ సీఎం కి కీలక బాధ్యతలు!

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో... భాజపా ఆకర్ష మంత్రాన్ని వాడాలనుకుంటోంది. దీనికోసం వివిధ పార్టీల్లో ఇమడలేకపోతున్న వ్యక్తులను పార్టీలోకి ఆహ్వానిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన అవిభాజ్య రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డిని పార్టీలోకి తీసుకోవాలని అధిష్టానం యోచిస్తున్నట్లు సమాచారం.

Update: 2023-12-22 08:03 GMT

Nallari kiran reddy 

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో... భాజపా ఆకర్ష మంత్రాన్ని వాడాలనుకుంటోంది. దీనికోసం వివిధ పార్టీల్లో ఇమడలేకపోతున్న వ్యక్తులను పార్టీలోకి ఆహ్వానిస్తోంది. అయితే పార్టీ అద్యక్షులని మరిస్థే బాగుంటుంది అని భవిస్తూ ఆంధ్రప్రదేశ్‌ విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన అవిభాజ్య రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డిని  రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలు కూడా అప్పజెపుతారని ప్రస్తుతం ఢిల్లీ లో  నడుస్తున్న టాక్‌.

రోశయ్య తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కిరణ్‌కుమార్‌ రెడ్డి మొదట్నుంచి రాష్ట్ర విభజనను వ్యతిరేకించారు. తద్వారా తెలంగాణవాదుల ఆగ్రహానికి గురయ్యారు. విభజన బిల్లు పాస్‌ అయిన తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, సమైక్యపార్టీని స్థాపించారు. 2014 ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన పార్టీ అన్ని స్థానాల్లోనూ ఓటమి పాలైంది. కొన్నాళ్లు ఆయన మౌనంగా ఉన్నారు. తర్వాత భాజప లో చేరారు. ఇక్కడ కూడా ఆయనకు పెద్దగా ఆదరణ దక్కలేదు.

రాజకీయ భవిష్యత్తు కోసం ఆయన ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రుల ప్రయోజనాల కోసం తపించిన వ్యక్తిగా ఆయనకు జనాల్లో ఉన్న ఇమేజ్‌ను క్యాష్‌ చేసుకోవాలని కమలం పెద్దలు భావిస్తున్నారు. ఆయనను  పార్టీ అధ్యక్ష పదవిని కట్టబెట్టాలని అనుకుంటున్నట్లు తెలిసింది. మరి ఆయన అధ్యక్షతన భాజపా గెలుపు అవకాశాలను ఏవిధంగా ప్రభావితం చేస్తుందో చూడాలి. కీలక బాధ్యతలు  

Tags:    

Similar News