చివరి వరకూ జగన్ వెంటే ఉంటా

రాజకీయంగా చివరి వరకూ జగన్ వెంటే ఉంటానని జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తెలిపారు. తనపై కొన్ని మీడియా సంస్థలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. జగన్ [more]

Update: 2020-08-25 12:55 GMT

రాజకీయంగా చివరి వరకూ జగన్ వెంటే ఉంటానని జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తెలిపారు. తనపై కొన్ని మీడియా సంస్థలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. జగన్ లేకుంటే తనకు రాజకీయ భవిష‌్యత్ లేదన్నారు సుధీర్ రెడ్డి. జగన్ లేకుంటే తాను అసలు రాజకీయాల్లోకి వచ్చేవాడిని కాదన్నారు. రఘురామ కృష్ణంరాజుతో తనను పోల్చి చూపడం దారుణమని సుధీర్ రెడ్డి అన్నారు. జగన్ కు తాను ఆసాంతం విధేయుడిగానే ఉంటానని చెప్పారు. జగన్ ఎమ్మెల్యే పదవికి ఎప్పుడు రాజీనామా చేయమన్నా చేస్తానని సుధీర్ రెడ్డి తెలిపారు. జమ్మలమడుగులో తన గెలుపునకు వైఎస్ జగన్ కుటుంబమే కారణమని, అలాంటి కుటుంబాన్ని తాను ఎందుకు దూరం చేసుకుంటానని సుధీర్ రెడ్డి తెలిపారు. తనపై కావాలని మీడియా దుష్ప్రచారం చేస్తుందన్నారు.

Tags:    

Similar News