30 మంది అమ్మాయిల నగ్న వీడియోలు తీసిన బాలుడు

Update: 2018-12-18 11:56 GMT

హైదరాబాద్ లో ఓ మైనర్ బాలుడు 30 మంది అమ్మాయిల నగ్న వీడియోలు తీసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. మాదాపూర్ లోని ఓ వర్కింగ్ వుమెన్స్ హాస్టల్ లో ఉంటున్న యువతులు బాత్ రూంలో స్నానాలు చేస్తుండగా పక్క ఇంట్లో నివాసం ఉండే యువకుడు రహస్యంగా సెల్ ఫోన్ లో వీడియోలు తీశాడు. అయితే వీడియో చిత్రీకరిస్తున్న సమయంలో సెల్‌ఫోన్ ఫ్లాష్‌ లైట్ వెలగడంతో ఓ అమ్మాయి వీడియో రికార్డ్ చేస్తున్న విషయాన్ని గుర్తించింది. దీంతో ఈ బాగోతం బట్టబయలైంది.

వీడియోలు ఏం చేశాడు?

ఆ బాలుడిపై యువతులు మాదాపూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ వీడియోలను తన దగ్గర ఉంచుకున్నాడా? లేదా స్నేహితులకు ఎవరికైనా పంపించాడా? అన్న అంశం కోణంలో పోలీసులు ధర్యాప్తు చేస్తున్నారు. 8వ తరగతి చదువుతున్న ఈ బాలుడికి తల్లిదండ్రులే సెల్‌ఫోన్ కొనిచ్చారు. ఫోన్ లో అశ్లీల వీడియోలు చూడటం అలవాటు పడి ఈ చర్యకు పాల్పడ్డట్లు పోలీసులు భావిస్తున్నారు.

Similar News