ఇంకా ఎక్కువ తిడతా

జగన్ డిక్లరేషన్ గురించి మాట్లాడితే ఇంకా ఎక్కువ తిడతానని మంత్రి కొడాలి నాని అన్నారు. మరోసారి కొడాలి నాని చంద్రబాబు పై ఫైరయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి [more]

Update: 2019-11-21 12:52 GMT

జగన్ డిక్లరేషన్ గురించి మాట్లాడితే ఇంకా ఎక్కువ తిడతానని మంత్రి కొడాలి నాని అన్నారు. మరోసారి కొడాలి నాని చంద్రబాబు పై ఫైరయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లాలంటే బీజేపీ, టీడీపీ సభ్యత్వాలు తీసుకోవాలా? అని కొడాలి నాని ప్రశ్నించారు. చంద్రబాబు జగన్ డిక్లరేషన్ పై మాట్లాడే అర్హత లేదన్నారు. తాను, వంశీ వల్లనే జూనియర్ ఎన్టీఆర్ పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారని టీడీపీ నేతలు అంటున్నారని, తాము బయటకు వచ్చాం కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ కు పార్టీ బాధ్యతలను అప్పగిస్తారా? అని ప్రశ్నించారు. లోకేష్ అర్థం లేని కామెంట్లు చేస్తున్నారన్నారు. పప్పు, చంద్రబాబులకు కమీషన్లు ఇవ్వడమే దేవినేని ఉమ పని అని కొడాలి నాని ఎద్దేవా చేవారు. తిరుమల వెంకన్నను తమ కులదైవంగా చెప్పుకునే చంద్రబాబు తన కుమారుడు, మనవడికి వెంకన్న పేరు ఎందుకు పెట్టలేదని అడిగారు. తిరుమల లడ్డూను, మద్యాన్ని పోలుస్తూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను కొడాలి నాని ఖండించారు.

Tags:    

Similar News