2.30 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్

తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చింది. 2021-22 ఆర్థిక సంవత్సరానకి 2,30,825 [more]

Update: 2021-03-18 07:28 GMT

తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చింది. 2021-22 ఆర్థిక సంవత్సరానకి 2,30,825 కోట్ల రూపాయల అంచనాతో హరీశ్ రావు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. గత బడ్జెట్ తో పోలిస్తే 48 వేల కోట్లు అధికంగా ఈ బడ్జెట్ లో కేటాయింపులు జరిపారు. తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ వ్యయం 1,69,383 కోట్లు కాగా, క్యాపిటల్ వ్యయం 29,046కోట్లుగా ఉంది. రైతు బంధుకోసం ఈ బడ్జెట్ లో 14,800 కోట్లను కేటాయించారు. రైతుల రుణమాఫీ కోసం 5,225 కోట్లు కేటాయించారు. సాగునీటి రంగానికి అత్యధికంగా 16,931 కోట్లను కేటాయించారు.

Tags:    

Similar News