Wether Report : పిడుగులు.. ఈదురుగాలులతో కూడిన వర్షాలు.. మూడు రోజులు ఇదే సీన్
తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఈదురుగాలులతో కూడిన వర్షాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వర్షాలు పడతాయని పేర్కొంది. అయితే పగటి పూట కొంత ఉష్ణోగ్రతలు గరిష్టంగా నమోదవుతాయని, అదే సాయంత్రం సమయానికి భారీ వర్షం పడే అవకాశముందని తెలిపింది. పశ్చిమ బెంగాల్ లో బలపడిన అల్పపీడనం కొనసాగుతుందని, దీని ప్రభావంతోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడతాయని, అలాగే ఉష్ణోగ్రతలు పగటి పూట బాగా ఉంటాయని తెలిపింది.
తేలికపాటి నుంచి...
దీంతో ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలెర్ట్ జారీ చేసింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నందున రైతులు తమ పంట ఉత్పత్తులను వర్షానికి తడిసిపోకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న ఇరవై నాలుగు గంటల్లో బలహీన పడుతుందని తెలిపింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, చెట్ల కింద విద్యుత్తు స్థంభాల వద్ద ఎవరూ నిల్చోకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
పిడుగులు పడతాయని...
దీంతోపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో కొంత పిడుగులు కూడా పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. పశువుల కాపర్లు, రైతులు మాత్రం చెట్ల కింద నిల్చోకుండా ఉండటం మంచిదని సూచించారు. ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో పాటు కూడిన వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. మిగిలిన జిల్లాల్లో మత్రం తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇదే సమయంలో వేడి గాలుల తీవ్రత కూడా తక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ అప్ డేట్ ఇచ్చింది.