Weather Report : మరో రెండు రోజులు వాతావరణం ఇలా ఉంటుంది... బిగ్ అప్ డేట్ ఇది
వాతావరణ శాఖ బిగ్ అప్ డేట్ ఇచ్చింది. నేడు కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశముందని తెలిపింది
వాతావరణ శాఖ బిగ్ అప్ డేట్ ఇచ్చింది. నేడు కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతుందని పేర్కొంది. రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఇది బంగాళాఖాతం వైపు కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. అనంతరం ఉత్తర, ఈశాన్య దిశగా తిరిగి ఇది బంగాళాఖాతంలో బలహీనపడుతుందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో నేడు కూడా అకస్మాత్తుగా పిడుగులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది.
నేడు పిడుగులతో కూడిన...
గురువారం తో పాటు శుక్రవారం కూడా పిడుగులతో కూడిన తేలికపాటి, మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. దీంతో పాటు సాయంత్రం వరకూ వడగాలుల ప్రభావం కూడా ఉంటుందని వాతావరణ శాఖ చెప్పింది. అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అకాల వర్షాలతో పంట ఉత్పత్తులు తడసిపోకుండా రైతన్నలు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. పిడుగులు పడే అవకాశం ఉందని, పశువుల కాపర్లు, రైతులు చెట్ల కింద ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
తెలంగాణలోనూ....
తెలంగాణలోనూ అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పింది. వర్షాలతో పాటు పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గే అవకాశముందని తెలిపింది. బుధవారం హైదరాబాద్ లో 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈరోజు కూడా అదే పరిస్థితి కొనసాగించే అవకాశముందని, అయితే వడగళ్ల వానలు కొన్ని చోట్ల పడే అవకాశముందని తెలిపింది. తెలంగాణలో నిన్న మొన్నటి వరకూ 40 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కానీ శుక్రవారం వరకూ ఇవి 36 డిగ్రీలకే పరిమితమయ్యే ఛాన్స్ ఉందని తెలిపింది.
క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో...
తెలంగాణలో క్యుములోనింబస్ మేఘాల ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురవనున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు వర్ష సూచన చేసింది. సిద్దిపేట, హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, యాదాద్రి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, నాగర్‌కర్నూల్ జిల్లాలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటే అవకాశముందని కూడా తెలిపింది.