కష్టాల్లో మావోయిస్టులు.. కరోనాతో పది మంది మృతి?

మావోయిస్టులు కరోనా బారిన పడ్డారన్న వార్త కలకలం రేపుతుంది. ఆంధ్రప్రదేశ్ – ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో మావోయిస్టులకు కరోనా సోకినట్లు పోలీసులకు సమాచారం అందింది. గాలకొండ దళం, [more]

Update: 2021-05-12 00:48 GMT

మావోయిస్టులు కరోనా బారిన పడ్డారన్న వార్త కలకలం రేపుతుంది. ఆంధ్రప్రదేశ్ – ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో మావోయిస్టులకు కరోనా సోకినట్లు పోలీసులకు సమాచారం అందింది. గాలకొండ దళం, బీకేఈజీ డీవీసీ దళం, కుంట ఏరియా కమిటీ దళాలకు చెందిన కమిటీ సభ్యులకు కరోనా సోకినట్లు తెలిసిందని, పోలీసు అధికారులు చెబుతున్నారు. వీరిలో ఎక్కువ మంది జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నారని, అయితే వీరిని మావోయిస్టు అగ్రనేతలు చికిత్స కోసం బయటకు పంపడం లేదని పోలీసుల అధికారులు చెబుతున్నారు. కరోనా బారిన పడిన మావోయిస్టులకు ఉచితంగా వైద్యం అందిస్తామని, మూర్ఖంగా ప్రాణాలు తీసుకోవద్దని పోలీసులు కోరుతున్నారు. ఇప్పటికే కరోనా బారిన పడి పది మంది మావోయిస్టులు మృతిచెందారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

Tags:    

Similar News