మావోయిస్టుల భారీ విధ్వంసం… 16 మంది జవాన్ల మృతి

మహారాష్ట్ర గడ్చిరోలీ జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. భద్రతాబలగాల వాహనాన్ని లక్ష్యంగా చేసుకొని మావోలు బాంబు పేల్చారు. బాంబు దాడిలో 16 మంది జవాన్లు కన్నుమూశారు. అదే [more]

Update: 2019-05-01 10:38 GMT

మహారాష్ట్ర గడ్చిరోలీ జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. భద్రతాబలగాల వాహనాన్ని లక్ష్యంగా చేసుకొని మావోలు బాంబు పేల్చారు. బాంబు దాడిలో 16 మంది జవాన్లు కన్నుమూశారు. అదే జిల్లాలోని కురికెడ సమీపంలోనూ మావోయిస్టులు హింసకు పాల్పడ్డారు. 27 వాహనాలకు నిప్పు పెట్టారు. జవాన్లపై దాడి ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్ గా స్పందించాయి. మావోయిస్టుల దాడి పిరికిపంద చర్య అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. మరణించిన జవాన్ల కుటుంబాలకు సంతాపం తెలిపిన ఆయన ఈ ఘటనకు పాల్పడ్డవారికి బుద్ధి చెబుతామన్నారు. మావోయిస్టుల దాడికి దీటైన సమాధానం ఇస్తామని మహారాష్ట్ర డీజీపీ హెచ్చరించారు.

Tags:    

Similar News