దోషిగా నిలబెట్టి మావోయిస్టు నేత హతం

బీజాపూర్‌లో ఈ మధ్య కాలంలో ఆదివాసీ ప్రాంతాల్లో గ్రామస్తులను మావోయిస్టులు హత్య లు చేస్తున్నారనే వార్తలు నేపథ్యంలో మావోయిస్టు అధిష్టానం దండకారణ్యం జోన్ ముఖ్యనేతలు సీరియస్ గా [more]

Update: 2020-10-03 08:18 GMT

బీజాపూర్‌లో ఈ మధ్య కాలంలో ఆదివాసీ ప్రాంతాల్లో గ్రామస్తులను మావోయిస్టులు హత్య లు చేస్తున్నారనే వార్తలు నేపథ్యంలో మావోయిస్టు అధిష్టానం దండకారణ్యం జోన్ ముఖ్యనేతలు సీరియస్ గా తీసుకున్నారు. హత్యల వెనుక పూర్వాపరాలు శోదించి ప్రజా కోర్టు నిర్వహించి అనంతరం స్థానిక డివిజన్ ఏరియా కమిటీ ఇంచార్జీ, కమాండర్ విజా మోడియం@ బద్రును దోషిగా నిర్ధారించింది. గ్రామస్తుల హత్యలు ఉద్దేశ్య పూర్వకంగా బద్రు ఏకపక్షంగా స్వంత నిర్ణయాలు తీసుకుని తనకు వ్యతిరేకంగా వున్న వారిని చంపాడనే అబియోగంతో మావోయిస్టులు తమ సొంత కమాండర్‌నే హత్యచేశారు.

డివిజన్ ఇన్ ఛార్జిగా….

మావోయిస్టు నాయకుడు, డివిసి ఇన్‌ఛార్జి గంగళూరు ఏరియా కమిటీ విజా మోడియం అలియాస్ బద్రు వయసు ((34 సంవత్సరాలు) బీజాపూర్ జిల్లా గంగలూర్ సమీపంలోని మంకేలి గ్రామస్తుడు. గురువారం హత్య చేసిన మావోయిస్టులు అనంతరం మృతదేహాన్ని అర్థరాత్రి కుటుంబానికి అప్పగించినట్లు విశ్వసనీయ సమాచారం. మావోయిస్టు పార్టీ లో కీలక నాయకుడి గా పేరు గాంచిన విజాను గంగళూరు మరియు కిరాండుల్ మధ్య ఎటావర్ అటవీప్రాంతంలో మావోయిస్టులు హత్య చేసినట్లు వార్తలు వస్తున్నాయి. స్వంత గ్రామం మాన్‌కెలిలో మావోయిస్టు కమాండర్ విజా అంత్యక్రియలు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పూర్తి చేసినట్లు సమాచారం అధికారికంగా ఘటనను దృవీకరించాల్సివుంది.

Tags:    

Similar News