యాభై కోట్లు ఈజీగా కొట్టేశాడే...?

Update: 2018-05-09 02:31 GMT

లగ్జరీకార్ల కేసులో బాధితుల సంఖ్య పెరుగుతోంది. నిందితుడు ఆకాశ్‌ గౌడ్‌ ఇప్పటివరకూ 20కోట్లే వసూలు చేశాడని భావించినా ఇప్పుడది 50 కోట్లకు చేరింది. లగ్జరీ కార్లు తక్కువ ధరకే ఇప్పిస్తానని చెప్పి దాదాపు వందమంది ప్రముఖులను మోసం చేసినట్లు తేలింది. మోసపోయిన వారిలో హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు ప్రజాప్రతినిధులున్నారు. రాయలసీమకు చెందిన నలుగురు, ఏపీకి చెందిన 8మంది నేతలు కూడా ఇతగాడి బుట్టలో పడ్డారు. ఇటు ఆకాశ్‌గౌడ్‌ నుంచి కార్లు కొనుగోలు చేసిన వారి జాబితా కూడా సిద్ధమైంది. 350మంది పేర్లతో టాస్క్‌ఫోర్స్‌ లిస్టు సిద్ధం చేసింది.

ఎవరూ ముందుకు రాకపోవడంతో...

ఇప్పటి వరకు ఈ కేసులో ఏ విఐపి కూడా తాను మోసపొయానని ముందుకు రాలేదు. సరిగదా బయటికి చెబితే తమ పరువు ఎక్కడ పొతుందో అన్న భయంతో విఐపిలు మొఖం చాటేస్తున్నారు. మరొక వైపు పోలీసులు అదుపులో వున్న ఆకాష్ విఐపి కార్లు చిట్టా విప్పుతుంటే నొరు వెల్లబెట్టవలసిందే.. ఎందుకంటే హైదరబాద్ కు చెందిన ఒక ప్రజాప్రతినిధి మాత్రమే ముందుకు వచ్చి లగ్జరీ కార్ల పేరుతో తన దగ్గర ఆకాష్ డబ్బులు తీసుకుని కారు ఇవ్వలేదని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు టాస్క్ ఫొర్స్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తుండంగా అన్ని విషయాలు బయట పడుతున్నాయి. లగ్జరీ కార్లను మార్కెట్ ధర కంటే ముప్పే శాతం తక్కువగా ఇస్తానని చెప్పాడు ఆకాష్. దీంతో ఇతనికి పెద్ద మొత్తంలో విఐపిలు డబ్బులు ట్రాన్స్ ఫర్ చేశారు. అయితే ఇప్పటి వరకు 350 లగ్జరీ కార్లును విఐపిలకు ఇచ్చాడు. మరొక 150 మంది విఐపిలు కూడా కార్లు కోసం ఆకాష్ వద్ద క్యూలు కట్టి యాభై కోట్ల రూపాయలను ఆన్ లైన్ ద్వారా చెల్లించారు. అయితే డబ్బులు తీసుకున్న తరువాత ఆకాష్ కార్లను డెలివరీ చేయలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని ఆకాష్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఇదిలా వుంటే డబ్బులు ఇచ్చి మోసపొయిన ప్రజాప్రతినిధులు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఇరవై మంది వుంటారని పోలీసులు విచారణ లో బయట పడింది.

Similar News