లోటస్ పాండ్ లో సీబీఐ దాడులు చేస్తే....?

Update: 2018-05-23 14:10 GMT

దేశ రాజకీయాల్లో చక్రం తిప్పడం చంద్రబాబునాయుడికి కొత్తేమీ కాదని మంత్రి నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. ఆయన మహానాడు ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని డెడ్ లైన్లు పెట్టడం సరికాదన్నారు. పవన్ కల్యాణ్ గతంలో ఉద్దానం సమస్యను ప్రస్తావించగానే తాము ఆ సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకున్నామన్నారు. డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఉద్దానంలో ఇంకా చేయాల్సింది ఎంతో ఉందని, చేస్తామని చెప్పారు. గుడిలో లింగాన్ని మింగే వాళ్లు టీటీడీలో ఆభరణాల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ప్రత్యేక హోదాపై మోదీని నిలదీసే ధైర్యం లేని వాళ్లు ఇలా మాట్లాడటాన్ని ఎద్దేవా చేశారు. బజారు వ్యక్తుల గురించి తాను మాట్లాడనన్నారు. ఏ1, ఏ2 ముద్దాయిల ఆరోపణలకు తాను సమాదానం చెప్పాలా అని ప్రశ్నించారు. లోటస్ పాండ్ లో సీబీఐ దాడులు చేస్తే అనేక విషయాలు వెలుగు చూస్తాయన్నారు లోకేష్.

Similar News