ఆదివారం మందు కోసం అస్సలు రాలేదట

మద్యం ధరల పెంపుతో లిక్కర్ వినియోగం ఆంధ్రప్రదేశ్ లో తగ్గింది. ప్రభుత్వం మద్యం ధరలను 75 శాతం పెంచింది. దీంతో మద్యం కొనుగోలు చేయడానికి పెద్దగా ఎవరూ [more]

Update: 2020-05-11 02:55 GMT

మద్యం ధరల పెంపుతో లిక్కర్ వినియోగం ఆంధ్రప్రదేశ్ లో తగ్గింది. ప్రభుత్వం మద్యం ధరలను 75 శాతం పెంచింది. దీంతో మద్యం కొనుగోలు చేయడానికి పెద్దగా ఎవరూ ముందుకు రావడం లేదు. శని, ఆదివారాల్లో మద్యం వినియోగం ఎక్కువా ఉంటుంది. ఆదివారం ఒక్కరోజే 70 నుంచి ఎనభై కోట్ల మధ్య విక్రయాలు ఉంటాయని ఎక్సైజ్ శాఖ చెబుతోంది. అయితే నిన్న ఆదివారం కేవలం 40 కోట్ల మేరకే విక్రయాలు ఏపీలో జరిగాయి. మద్యం ధరల పెంపుదలతోనే విక్రయాలు తగ్గించగలిగామని ప్రభుత్వం చెబుతోంది. ిఇప్పుడు ఏపీలో మద్యం దుకాణాల వద్ద క్యూలు కూడా కన్పించడం లేదు. షాపుల సంఖ్య తగ్గించినా మద్యం ధరలతో మందుబాబులు బెంబేలెత్తిపోతున్నారు.

Tags:    

Similar News