కర్ణాటక సీఎం గా సోమవారం చేయాల్సిన కుమార స్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమం బుధవారానికి వాయిదా పడింది. తొలుత సోమవారం ఈ కార్యక్రమం పూర్తి కావలిసి ఉండగా కాంగ్రెస్ అభ్యర్ధన మేరకు బుధవారానికి వాయిదా పడింది. రాజీవ్ గాంధీ వర్ధంతి సోమవారం ఉండటంతో జేడీఎస్ కాంగ్రెస్ లు చర్చలు తరువాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రమాణ స్వీకారంలో కాంగ్రెస్ పార్టీకి 20 కి పైగా మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందని అంటున్నారు. తమ సంకీర్ణంలో అత్యధిక సీట్లు కాంగ్రెస్ కి దక్కడంతో ఆ రేషియో ప్రకారమే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని జేడీఎస్ భావిస్తుంది.
ప్రమాణస్వీకారానికి వారికి ఆహ్వానం ...
కర్ణాటక రాజకీయాల్లో హోరా హోరీ పోరు సాగింది. ఈ పోరాటం మోడీ వెర్సెస్ దేశంలోని విపక్షాలు అన్న రీతిలో సాగింది. దేశమంతా కిందపడిన పైచేయి సాధిస్తూ ప్రతి రాష్ట్రం లో కాషాయ జెండా పాతుతూ సాగిపోతున్న మోడీ, షా బృందం విజయాలకు బ్రేక్ వేయడం ఆషామాషీ కాదు. విజయవంతమైన జోడి మోడీ, షా లకు తోడు గాలి బ్రదర్స్, శ్రీ రాములు వంటి వారు కాకలు తీరిన ఎడ్డీ ని తట్టుకుని ప్రభుత్వం స్థాపించడం అంటే మాటలు కాదు. అందుకే ఈ విజయాన్ని దేశంలోని విపక్షాలతో పంచుకునేందుకు జేడీఎస్ కాంగ్రెస్ లు నిర్ణయించాయి. అందుకే ప్రమాణ స్వీకారానికి మమతా బెనర్జీ, చంద్రబాబు నాయుడు, కేసీఆర్, కేజ్రీవాల్, వంటి ముఖ్యమంత్రులతో పాటు స్టాలిన్ వంటి వివిధ రాష్ట్రాల్లో హేమా హేమీలను ప్రత్యేక అతిధులకు ఆహ్వానాలు వెళ్లాయి. మోడీ టీం ను ఇక ఉమ్మడి ఐక్య పోరాటంతో తిప్పి కొట్టడానికి కర్ణాటక సీఎం ప్రమాణోత్సవ కార్యక్రమాన్ని కాంగ్రెస్ వేదిక చేయడం విశేషం.